Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశులవారికి డబ్బుకు లోటు ఉండదు.. ‘లవ్ లైఫ్’‌లో మాత్రం సమస్యలే.!

Astrology: జోతిష్యం, రాశిఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా...

Zodiac Signs: ఈ రాశులవారికి డబ్బుకు లోటు ఉండదు.. 'లవ్ లైఫ్'‌లో మాత్రం సమస్యలే.!
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 02, 2021 | 8:30 AM

జోతిష్యం, రాశిఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా జరుగుతాయని భావిస్తుంటారు. అందుకే ప్రతీ పని మొదలుపెట్టే ముందు తమ రాశిఫలాలను ఒకసారి పరిశీలిస్తుంటారు. ఇదిలా ఉంటే.. మన జీవితంలో దేనిని అంత సులువుగా పొందలేం. ఎక్కడొక చోట కొరత ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి కావాలంటే.. మరొకదాన్ని వదులుకోక తప్పదు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మేషం, సింహం, కన్య, కుంభం రాశివారికి డబ్బుకు అస్సలు లోటు ఉండదు. అయితే వీరి ‘లవ్ లైఫ్’లో ఎలప్పుడూ ఏదొక సమస్య తలెత్తుతుంది.

మేషం:

ఈ రాశివారు ప్రభావశీలురు. ఈ రాశికి చెందిన వ్యక్తులు పుట్టినప్పటి నుంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. చాలా కష్టపడి పని చేస్తారు. ఇందువల్ల వీరి జీవితంలో విజయాల పరంపర కొనసాగుతుంది. అయితే వారిలో ఉండే ఆధిపత్య స్వభావం కారణంగా లవ్ లైఫ్‌లో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.

సింహరాశి:

ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు. అంతేకాకుండా నిజాయితీపరులు కూడా. ఈ రెండు గుణాలు వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అయితే వీరి తరచూ ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. దాని కారణంగా వీరి లవ్ లైఫ్‌లో సమస్యలు వస్తుంటాయి.

కన్యా రాశి:

ఈ రాశివారికి డబ్బు ఎలా ఆదా చేయాలో బాగా తెలుసు. ప్రేమ వ్యవహారాల్లో కూడా తెలివిగా వ్యవహరిస్తారు. అయితే వీరు తమ తప్పులను త్వరగా అంగీకరించకపోవడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. దీని వల్ల కొన్నిసార్లు వారి లవ్ లైఫ్‌లో తగాదాలు తలెత్తుతాయి.

కుంభం:

ఈ రాశివారు దయగలిగినవారు, కష్టపడే తత్త్వం కలిగినవారు. వారు తమ శ్రమకు తగిన గుర్తింపును పొందటమే కాకుండా డబ్బును కూడా సంపాదిస్తారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ భాగస్వాములకు తగినంత సమయం ఇవ్వనందున కొన్నిసార్లు గొడవలు తలెత్తుతాయి. అలాగే తగాదాలు కూడా ఏర్పడుతాయి.