Monkey Fever: దేశంలో హడలెత్తిస్తోన్న మరో వైరస్.. మంకీ ఫీవర్‌తో రెండు మరణాలు.. చికిత్స లేదు.. నివారణే మార్గం..
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. కీటకాలు కోతులను కుట్టి.. మళ్లీ వచ్చి మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ జ్వరానికి మందు లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే రోగికి చికిత్స అందిస్తారు. మంకీ ఫీవర్ వైరస్, బ్యాక్టీరియా రెండింటి వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. ఎక్కడోచోట ఏదొక వైరస్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతూ ఆందోళన పెంచుతున్నాయి. గోవా, మహారాష్ట్ర సహా కర్ణాటకలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కర్ణాటకలోనే ఇప్పటివరకు 64కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ జ్వరంతో గత నెలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు మరణాల తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు సన్నాహాలు చేస్తోంది. ఎందుకంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు.
నిపుణులు ఏమంటున్నారంటే..
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. కీటకాలు కోతులను కుట్టి.. మళ్లీ వచ్చి మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ జ్వరానికి మందు లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే రోగికి చికిత్స అందిస్తారు. మంకీ ఫీవర్ వైరస్, బ్యాక్టీరియా రెండింటి వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. టీకాలు తయారు చేయని అనేక రకాల వైరస్ వ్యాధులు ఉన్నాయి. అయితే ఈ వైరస్ వ్యాధి కేసులు కూడా తక్కువ.
మంకీ ఫీవర్ లక్షణాలు
ఈ వైరస్ వల్ల వచ్చే జ్వరం గురించి మాట్లాడినట్లయితే, అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, బలహీనత, వాంతులు , విరేచనాలు, చిగుళ్ళలో రక్తస్రావం వంటి వాటితో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.
ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది?
క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని కూడా పిలువబడే కోతుల జ్వరం కారణంగా మొదటి మరణం జనవరి 8 న శివమొగ్గ జిల్లాలోని హోసానగర్‌లో నమోదైందని ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ వైరస్ కారణంగా 18 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. రెండో మరణం ఉడిపి జిల్లాలోని మణిపాల్‌లో 79 ఏళ్ల వృద్ధుడిది. ఈ వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.. దీని కారణంగా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ చాలా ఆందోళన చెందుతోంది. వైరస్ వ్యాపించడకుండా నివారణ చర్యలు తీసుకోవడానికి సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ ఫీవర్ ఎలా వ్యాపిస్తుంది?
ఇది ఒక వైరల్ వ్యాధి. ఇది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది. జంతువుల నుండి మనుషులకు సంక్రమణ వ్యాప్తి చెందడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి మొదటిసారిగా 1957లో కర్ణాటకలోని దట్టమైన అడవులలో నమోదైంది. కోతుల శరీరంలో కనిపించే పేలు.. మనిషిని కురవడంతో మానవులలో సంభవించింది.
ఎలా రక్షించుకోవాలంటే
వైద్య నివేదికల ప్రకారం ఈ మంకీ ఫీవర్ కు నిర్దిష్ట చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ వ్యాధి సోకకుండా నిరోధించడానికి ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ ద్వారా టీకాలు అందించనున్నారు. దీనిని నివారించడానికి, ఎక్కువ నీరు త్రాగుతూ ఉండలి. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..