Men Health: మగాళ్లూ బీ అలర్ట్.. లైంగిక సామర్థ్యం కోసం 4 విషయాలు తప్పక పాటించాలి.. లేదంటే అంతేసంగతి..
90ల ముందు తరాల వారికి.. ఆ తరువాత తరాల వారికి లైంగిక సామర్థ్యం విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం.. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో ఎంతోమంది దంపతులు..

90ల ముందు తరాల వారికి.. ఆ తరువాత తరాల వారికి లైంగిక సామర్థ్యం విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం.. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో ఎంతోమంది దంపతులు.. సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, కొన్ని అంశాలను పాటించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి కోసం పురుషులు ఏం పాటించాలి? ఏం చేయాలి? అనే వివరాలు తెలుసుకుందాం..
వ్యాయామం..
మెరుగైన జీవనశైలిని అనుసరించడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. సైక్లింగ్, స్విమ్మింగ్, కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఫీల్ గుడ్ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. స్పెర్మ్ నాణ్యత మెరుగవుతుంది.
ఒత్తిడిని తగ్గించుకుని, రిలాక్స్‌గా ఉండాలి..
రోజువారీ బిజీ లైఫ్‌లో ఒత్తిడి అనేది సర్వసాధారణం. దీర్ఘకాలిక ఒత్తిడి లేదా ఆందోళన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి అనేది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే.. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ధూమపానం అనేది మరొక ‘స్ట్రెస్ బస్టర్’, ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కావున ధూమపానం మానేయాలి. ఇక ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేయొద్దు. ఇది వ్యక్తి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది.




మెరుగైన ఆరోగ్యం.. మెరుగైన లైంగిక సామర్థ్యానికి కారణం..
అంగస్తంభన లోపం, అకాల స్కలనం వంటి సమస్యలతో చాలామంది వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. మొహమాటం, సిగ్గు, బిడియంతో చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పుకోలేక, వైద్యులను సంప్రదించలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఇలా కాకుండా.. ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.
డైట్..
ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలంలో పునరుత్పత్తి ఆరోగ్యంతో సహా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అందుకే.. ఈ ప్రాసెస్డ్, జంక్‌ఫుడ్‌కు బదులుగా.. గుడ్లు, పండ్లు, వాల్‌నట్స్, కూరగాయలతో సహా ప్రోటీన్స్ ఉండే ఆహారాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్‌లతో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది. స్పెర్మ్ నాణ్యత మెరుగవుతుంది.
గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాసాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స పొందాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..