Disadvantages of Amla: ఉసిరితో ఆరోగ్యమే కాదు అనారోగ్య సమస్యలు కూడా.. అలాంటి వారు ఉసిరి తిన్నారో? ఇక అంతే సంగతులు
ఉసిరి తినడం వల్ల లాభాల గురించే కాకుండా నష్టాల గురించి కూడా ఆలోచించారా? నిజమే కొందరిలో ప్రతిసారీ ఉసిరికాయ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఉసిరి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. కానీ ఉసిరి తినడం వల్ల లాభాల గురించే కాకుండా నష్టాల గురించి కూడా ఆలోచించారా? నిజమే కొందరిలో ప్రతిసారీ ఉసిరికాయ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా ఉసిరికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉసిరి తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
కాలేయ సంబంధిత సమస్యలు
ఉసిరి రసం అనేక కాలేయ సంబంధిత పరిస్థితులకు హానికరం. ఉదాహరణకు దాని విటమిన్ సి, అధిక ఆమ్ల స్వభావం కాలేయ గాయం, నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల కాలేయం దెబ్బతినడం, లివర్ సిర్రోసిస్ వంటి సందర్భాల్లో ఉసిరికి దూరంగా ఉండడం మేలు
మూత్రపిండాలపై ప్రభావం ఇలా
ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలున్న వారికి హానికరంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రసం మూత్రవిసర్జన లక్షణాలతో నిండి ఉంది. అయితే ఇది మూత్రపిండాల వ్యాధి సమయంలో కొన్ని కణాలు, కణజాలాలను దెబ్బతీసే కొన్ని బయోయాక్టివ్ పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల, మీరు తీవ్రమైన మూత్రపిండ వ్యాధికి గురైతే ఉసిరి నుంచి దూరంగా ఉండడం మేలు
తక్కువ బీపీ ఉన్నవారు
ఉసిరికాయ అధిక బీపీ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి, తక్కువ బీపీ ఉన్నవారికి ఇది హానికరం. ఇది రక్తపోటును తగ్గించడానికి, నిర్వహించడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ముఖ్యంగా హైపోటెన్షన్‌తో బాధపడుతున్నవారు ఉసిరి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుననారు.
గర్భధారణ సమయంలో దుష్ప్రభావాలు
ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మీకు చాలా రకాలుగా హాని కలుగుతుంది. ముందుగా ఇది ఆమ్లత్వం, పుల్లని త్రేన్పు సమస్యను పెంచుతుంది. అలాగే మీకు ఉబ్బరం సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మూత్రవిసర్జన లక్షణాలతో సమృద్ధిగా ఉండడం వల్ల నిర్జలీకరణ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి గర్భదారణ సమయంలో ఉసిరి మంచిది కాదు కాబట్టి వీలైనంతగా దానికి దూరంగా ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి