Basil: తులసితో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్యర్యపోతారు.. తాజా అధ్యయనంలో వెల్లడి..!

Basil: ఇటీవలి కాలంలో మనిషి జీవితం బిజీబిజీగా మారిపోవటం, నిత్యం అనేక టెన్షన్లతో సతమతం కావటం వల్ల అనేక రోగా బారిన పడుతున్నాడు. ఇలాంటి..

Basil: తులసితో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్యర్యపోతారు.. తాజా అధ్యయనంలో వెల్లడి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 03, 2021 | 6:09 AM

Basil: ఇటీవలి కాలంలో మనిషి జీవితం బిజీబిజీగా మారిపోవటం, నిత్యం అనేక టెన్షన్లతో సతమతం కావటం వల్ల అనేక రోగా బారిన పడుతున్నాడు. ఇలాంటి జీవనవిధానంలో వివిధ రకాల ఒత్తిడులకు మనిషి లోనవుతున్నాడు. ఇక భారతీయుల జీవనశైలిలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేద ఔషధాలలో తులసిని విరివిగా వినియోగిస్తారు. అందుకే తులసిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌ గా పిలుస్తారు. 2వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితతోపాటు, రుగ్వేదంలోను తులసి గురించిన ప్రస్తావన ఉంది. తులసిలో ఎ, సి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, క్లోరోఫిల్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతవరకు తులసి శారీరక ఆరోగ్యానికి మేలుచేసే ఔషధంగా మాత్రమే మనందరికీ తెలుసు.

తులసి గురించిన మరొక రహస్యం వెలుగులోకి వచ్చింది. తులసి మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచే అడాప్టోజెన్‌ను కలిగి ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మానసిక ఆందోళనను తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ది క్లినికల్‌ ఎఫికెసి అండ్‌ సేఫ్టీ ఆఫ్‌ తులసి ఇన్‌ హ్యూమన్స్‌ పేర విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం .. పర్యావరణం కారణంగా ఒత్తిడులకు గురైనప్పుడు తులసి సహనాన్ని పెంచడానికి సహాయపడుతుందని వెల్లడించింది. నిద్ర, మతిమరుపు, లైంగిక సంబంధిత సమస్యలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని నివేదికలో తెల్పింది.

దీనితోపాటు ది జర్నల్‌ ఆఫ్‌ ఆయుర్వేద అండ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ ప్రకారం తులసిలో యాంటీడిప్రెషన్‌, యాంటీ యాంగ్జైటీ కారకాలు కనుగొంది. ప్రతి రోజూ 5 వందల మిల్లీ గ్రాముల తులసి ఆకుల రసాన్ని తాగినవారిలో ఒత్తిడి గణనీయంగా తగ్గినట్లు అధ్యయనం ద్వారా నిరూపితమైంది. మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను తులసి చూపగినట్లు పీర్-రివ్యూడ్ జర్నల్‌ లో ప్రచురించిన ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్‌ ఆల్టర్నేటివ్ మెడిసిన్‌ అధ్యయనం తేల్చింది.

యోగా చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని చాలా మంది సూచిస్తుంటారు. తులసిని టీగా తాగడం వల్ల యోగా వల్ల ఎలాంటి ప్రశాంతత సమకూరుతుందో దీని వల్ల అదే ఫలితం వస్తుందట. తులసి టీలో కెఫిన్‌ ఉండనందున శరీరాన్ని ప్రశాంతంగా ఉంచేలా దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలో ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కార్టిసాల్‌ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. కార్టిసాల్‌ ను స్ట్రెస్‌ హార్మోన్ సమత్యులతకు తులసి బాగా పనిచేస్తుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రించేందుకు తులసి సహాయకారిగా చెప్పవచ్చు.

ఇవీ కూడా చదవండి:

 ఈ అలవాట్లకు దూరంగా ఉంటే గుండె ప‌దిలం.. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

Health Benefits: పెరుగు, దానిమ్మ, పాలకుర, నిమ్మ, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!

Diabetes : డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Brain Stroke Symptoms: నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిన్‌ స్ట్రోకే..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.