AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basmati Rice Benefits: జ్ఞాపకశక్తిని పెంచే బాస్మతి రైస్.. తరచుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Basmati Rice Health Benefits: బాస్మతి రైస్ భారత దేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న అరోమాటిక్ బియ్యం. దీని ప్రత్యేకత పెద్ద గింజలు, సువాసన కలిగి ఉంటాయి. ఎక్కడ ఫంక్షన్ల..

Basmati Rice Benefits: జ్ఞాపకశక్తిని పెంచే బాస్మతి రైస్.. తరచుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Basmati Rice
Surya Kala
|

Updated on: Oct 03, 2021 | 7:29 AM

Share

Basmati Rice Health Benefits: బాస్మతి రైస్ భారత దేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న అరోమాటిక్ బియ్యం. దీని ప్రత్యేకత పెద్ద గింజలు, సువాసన కలిగి ఉంటాయి. ఎక్కడ ఫంక్షన్ల జరిగినా, ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసే పదార్ధాలను బాస్మతి రైస్ తో తయారు చేస్తారు. ఈ రైస్ తో చేసే వంటలు చూస్తే చాలు తినాలి అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. అయితే ఆ బాస్మతి రైస్ తయారు చేసిన వంటకాలు నోరుఊరించడమే కాదు.. సాధారణ బియ్యంతో పోలిస్తే అనేక ఆరోగ్య ప్రయయోజనాలు కూడా ఇస్తాయి. ఇక ఈ రైస్ లో రెండు రకాలున్నాయి. వైట్ బాస్మతి, బ్రౌన్ బాస్మతి అనే రెండు రకాలలో ఈ బియ్యం లభిస్తాయి. ఇవి చక్కటి రుచితో పాటు సువాసనను సైతం కలిగి ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు: 

బ్రౌన్ బాస్మతి బియ్యంలో పిండి పదార్థం లతో పాటు బీ విటమిన్లను కూడా ఉన్నాయి. అంతేకాదు సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రౌన్ బాస్మతి రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఈ రైస్తీ తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించే అవకాశం ఉంది.

బాస్మతి రైస్ తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. బాస్మతి బియ్యంతో వండిన ఆహారం తేలికగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. బాస్మతి బియ్యం తేలికగా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఈ ప్రత్యేక బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల బరువు తగ్గుతారు. అదే సమయంలో ఒకటి కంటే ఎక్కువ శారీరక ప్రయోజనాలు ఇస్తాయి.

కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉన్నట్లైతే .. బాస్మతి బియ్యాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

బాస్మతి బియ్యంలో “థియామిన్” అనే విటమిన్ ఉన్నట్లు పలు అధ్యయనాలు ద్వారా తేలింది. ఈ విటమిన్ ను వైద్య శాస్త్రంలో బ్రెయిన్ విటమిన్ అని కూడా అంటారు.   ప్రత్యేకమైన విటమిన్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత తక్కువ సమయంలోనే నాడీ వ్యవస్థ సామర్ధ్యాన్ని పెంచుతుంది. దీంతో ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది.  జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంతే కాదు, అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులను దూరంగా ఉంచడంలో ఈ విటమిన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ రైస్ లో ఉన్న థయామిన్ , నియాసిన్ వంటి విటమిన్లు  జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అలాగే నాడీ వ్యవస్థ , గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బాస్మతి రైస్ సాధారణ బియ్యం కన్నా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా, కడుపు ఎక్కువసేపు బరువుగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆకలిని నియంత్రించాలనుకుంటే, మీరు ఖచ్చితంగా ఈ బియ్యం చక్కని పరిష్కారం.

దీంతో సాధారణంగా వినియోగించే బియ్యంతో పోలిస్తే బాస్మతి బియ్యం ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే మెరుగైన బియ్యం అని చెప్పవచ్చు. ఇక ఈ బాస్మతి బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే సాధారణ బియ్యంతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువ. అందుల్లనే స్పెషల్ అకేషన్ సమయంలో జీరా రైస్, కిచిడీ, ఫలావ్, బిర్యానీ వంటి స్పెషల్ ఆహారపదార్ధాల తయారీ సమయంలో బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ తయారీ కోసం ఎక్కువమంది బాస్మతి రైస్ ను వినియోగిస్తారు.  ప్రపంచంలో 70% బాస్మతీ బియ్యం భారత లోనే పండిస్తున్నారు. దానిలో కొంత భాగాన్ని సేంద్రీయంగా పెంచుతారు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఈ బాస్మతీ బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ మరింత పెంచడాని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక ఈ బాస్మతి రైస్ పేటెంట్ హక్కు కోసం అమెరికాలోని ఓ సంస్థతో భారత్ పోరాడి.. చివరి పేటెంట్ హక్కుని మన దేశం దక్కించుకుంది.

Also Read: Horoscope Today: ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..