Lung health: ఈ 5 లక్షణాలు మీ లంగ్స్ ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి.. తేడాగా అనిపిస్తే అస్సలు విస్మరించొద్దు..

శరీరంలోని ఇతర అవయవాల్లాగే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం..

Lung health: ఈ 5 లక్షణాలు మీ లంగ్స్ ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి.. తేడాగా అనిపిస్తే అస్సలు విస్మరించొద్దు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 27, 2023 | 8:31 AM

శరీరంలోని ఇతర అవయవాల్లాగే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. అబ్‌స్ట్రక్టీవ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఆస్తమాతో సహా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం 2,35,000 మరణాలు నమోదవుతున్నాయి.

వాతావరణంలోని విషపూరితమైన గాలి, కాలుష్యం, ధూళిని పీల్చడం, ధూమపానం వంటి కారణాలు సహా అవయవాన్ని క్షీణింపజేసే ఇతర విషయాల వల్ల శరీరంలోని ఇతర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యంగా వేగంగా తగ్గుతుంది. వీటి కారణంగా కాలక్రమేణా, ఊపిరితిత్తులు తమ శక్తిని కోల్పోతాయి. ఇది శ్వాస తీసుకోవడం మరింత కష్టతరం చేస్తుంది.

అయితే, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా.. మనం మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా చూసుకోవచ్చు.

శరీరంలో అవయవాలు పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఈ ఆక్సీజన్‌ను శరీరానికి అందించేది ఊపిరితిత్తులు. ఒకవేళ మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారంటే.. అది శరీరానికి తగినంత ఆక్సీజన్ అందకపోవడం వల్లేనని అర్థం చేసుకోవచ్చు. తగినంత ఆక్సీజన్ అందకపోతే.. శరీరంలోని కీలకమైన అవయవాలు పని చేయవు.

శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన సంకేతాలు..

శరీరంలో ఏ సమస్య వచ్చినా.. ముందుగా అందుకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శ్వాసకోస సమస్యలు ఉన్నప్పుడు.. వాటిని ముందుగానే గుర్తించేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా మీకు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం అత్యవసరం.

ఊపిరి ఆడకపోవడం..

చాలా మంది ప్రజలు దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. శ్వాస అందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అంటే.. ఊపిరితిత్తులు ఆక్సీజన్‌‌ను సరిపడా తీసుకునేంత శక్తిని కలిగి లేవని అర్థం. కొన్ని సందర్భాల్లో సాధారణం కంటే ఎక్కువగా పనిచేసినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది సర్వసాధారణం. కానీ, సాధారణ సమయాల్లోనూ ఆకస్మికంగా శ్వాస సమస్యలు రావడం అంటే.. రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి కారణాలివే..

ఆస్తమా, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం, ఊపిరితిత్తులలో అధిక ద్రవం, COPD, కోవిడ్-19, ఊపిరితిత్తుల పతనం, పల్మనరీ ఎంబోలిజం, క్షయవ్యాధి, పల్మనరీ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రూప్, అనాఫిలాక్సిస్.

చర్మం రంగులో మార్పు లేదా సైనోసిస్..

రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండే వారి చర్మం నీలం రంగులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిని సైనోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసలోపం, ఇతర లక్షణాలతో పాటు అభివృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల సమస్యల కారణంగా సైనోసిస్ ఏర్పడుతుంది, ఈ వ్యాధి నెమ్మదిగా తీవ్రంగా మారుతుంది.

ఊపిరితిత్తులలో సైనోసిస్ కారణాలు..

ఎత్తైన ప్రదేశాలు ఎక్కినప్పుడు శ్వాస తీసుకోవడంలో సమస్య. ఆస్తమా, శ్వాసకోశ సంక్రమణం, ఊపిరితిత్తుల ధమనులలో రక్తం గడ్డకట్టడం, COPD, ఊపిరితిత్తుల రక్తపోటు, న్యుమోనియా.

హెమోప్టిసిస్..

హెమోప్టిసిస్ కారణంగా.. శ్వాసకోశం నుంచి రక్తస్రావం జరుగుతుంది. హెమోప్టిసిస్ తీవ్రత అధికంగా ఉంటే.. 24 గంటల్లో 600 ఎంఎల్ కంటే ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తుల పతనానికి దారితీస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఏర్పడిన కణితి కారణంగా పుపుస ధమనులు దెబ్బతింటాయి. తద్వారా హెమోప్టిసిస్‌లో రక్తం ఈ శ్వాసనాళ నుంచి వస్తుంది. హెమోప్టిసిస్‌కు కారణాలివే. తీవ్రమైన న్యుమోనియా, క్షయవ్యాధి, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్.

గురక..

గురక అనేది చాలా మందిలో కనిపిస్తుంటుంది. అయితే, ఈ గురక రావడానికి కారణం శ్వాస సంబంధిత సమస్యలే కారణం. ఊపిరితిత్తుల పనితీరులో సమస్య ఉంటే గురక సమస్య తలెత్తుతుంది. గురక తీవ్రత అధికంగా ఉంటే మాత్రం.. వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. గురకకు అత్యంత సాధారణ కారణాలు: ఆస్తమా, COPD.

ఛాతి నొప్పి..

దీర్ఘకాలిక ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఇక్కడ ధమని ఊపిరితిత్తుల కణజాలానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొర వాపు వస్తుంది. దీనిని ప్లూరిసీ అని పిలుస్తారు. దీని కారణంగా ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి వస్తుంటుంది. ఊపిరితిత్తులు, పక్కటెముకల మధ్య ఖాళీలోకి గాలి లీక్ అయినప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నిపుణులు చెప్పిన సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. ఏదైనా అనారోగ్య సమస్యలుంటే ముందుగా వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..