AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lung Cancer Vaccine: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు తొలి వ్యాక్సిన్‌.. 67 ఏళ్ల రోగిపై ట్రయల్స్!

వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. దీనిని శుక్రవారం యూకేకి చెందని ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగిపై ప్రయోగించారు. మొట్టమొదటి సారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్‌ ట్రయల్ చేసి, దాని పనితీరును కోటి ఆశలతో పరిశీలిస్తున్నారు. ఇదే విజయవంతమైతే వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు గ్రౌండ్ బ్రేకింగ్‌ సామర్ధ్యాన్ని సంపాదించినట్లు అవుతుంది. ప్రపంచంలోని అత్యధిక మరణాలకు..

Lung Cancer Vaccine: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు తొలి వ్యాక్సిన్‌.. 67 ఏళ్ల రోగిపై ట్రయల్స్!
Lung Cancer
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 23, 2024 | 2:00 PM

Share

వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. దీనిని శుక్రవారం యూకేకి చెందని ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగిపై ప్రయోగించారు. మొట్టమొదటి సారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్‌ ట్రయల్ చేసి, దాని పనితీరును కోటి ఆశలతో పరిశీలిస్తున్నారు. ఇదే విజయవంతమైతే వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు గ్రౌండ్ బ్రేకింగ్‌ సామర్ధ్యాన్ని సంపాదించినట్లు అవుతుంది. ప్రపంచంలోని అత్యధిక మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ప్రతీయేట 1.8 మిలియన్ల మంది దీని వల్ల మరణిస్తున్నారు. ఇప్పటికే BNT116 పేరిట ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ కనుగొనగా ఈ రోజు తొలిసారిగా UKలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్‌ను వాడారు. జానస్జ్ రాక్జ్‌కు జబ్ అనే 67 ఏళ్ల రోగికి ఆరు సిరంజిల వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీటిల్లో ప్రతి వ్యాక్సిన్‌ క్యాన్సర్ కణితుల విభిన్న భాగానికి సంబంధించిన జన్యు పదార్థాన్ని కలిగి ఉన్నాయి. రోగి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలోని ఐదు బిలియన్ కణాలపై దాడి చేసే సామర్థ్యం ఈ వ్యాక్సిన్లకు ఉంది. ఈ వ్యాక్సిన్‌ను బయోఎన్‌టెక్ కంపెనీ తయారు చేసింది. వ్యాధి అత్యంత సాధారణ రూపమైన నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) చికిత్సకు BNT116 వ్యాక్సిన్ ప్రయోగించారు.

వైద్యుల ప్రకారం.. ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ యూనివర్శిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ – కీమోథెరపీ కంటే చాలా ఖచ్చితత్వంతో పని చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన కణాలపై ఏ విధమైన నష్టాన్ని కలిగించదు. నొప్పి లేకుండా వ్యాధిని నివారించవచ్చు. ఇది కీమో కంటే చాలా బెటర్‌ ట్రీట్‌మెంట్‌ అని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, mRNA వ్యాక్సిన్ రోగి శరీరంలోని క్యాన్సర్‌ కణితులను గుర్తించి, వాటిపై పోరాడటానికి రోగుల రోగనిరోధక వ్యవస్థలకు శిక్షణ ఇస్తుంది. ఇది రోగనిరోధక ప్రతిస్పందనను అణిచివేసే కణాలను సమర్థవంతంగా తొలగించగలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ రోగి రోగనిరోధక శక్తిని పెంచుతుందని, 12 నెలల్లో విడతల వారీగా మోతాదులను అందిస్తామని అంటున్నారు.

నాన్-స్మాల్ సెల్ వ్యాక్సిన్‌ ప్రయోగం విజయవంతమైతే నాలా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వందలా మందికి ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్‌ ప్రయోగంలో నేను మొదటి వ్యక్తిగానా, వందో వ్యక్తినా అనే విషయంతోనాకు పట్టింపు లేదు. అది నాకు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. వ్యాక్సిన్ వేగంగా ఉత్పత్తికి వెళితే ఇతర రోగుల ప్రాణాలు కాపాడవచ్చు.COVID-19 వ్యాక్సిన్‌లు మిలియన్ల మందికి సహాయపడింది. ఇది లక్షలాది మందికి సహాయం చేస్తుందని తొలి వ్యాక్సిన్‌ వేయించుకున్న జానస్జ్ రాక్జ్‌కు జబ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి ?

నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధి. ఇది సైలెంట్‌గా శరీరంలో వృద్ధి చెందుతుంది. వ్యాధి నిర్ధారణ సమయానికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కాబట్టి ముందుగానే గుర్తించి, చికిత్స చేయడం చాలా అవసరం. చాలా వరకు ధూమపానం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కేవలం పావు వంతు మంది మాత్రమే ఐదు సంవత్సరాలు జీవించ గలుగుతారు. రోగుల మెదడు, కాలేయం, చర్మం, శోషరస గ్రంథులు, అడ్రినల్ గ్రంధులతో సహా శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్‌ కణాలు వేగంగా వ్యాపిస్తాయి. ఈ పరిస్థితిని మెటాస్టాటిక్ నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటారు. సుధీర్ఘకాల దగ్గు, ఛాతీ నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.