అందేంటంటే.. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన అధ్యాయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మౌత్ వాష్ వాడటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మౌత్ వాష్‌లోని జింక్ గ్లూకోనేట్, ట్రైక్లోసన్, థైమోల్, సెటిల్‌పైరిడినియం క్లోరైడ్ మొదలైన పదార్థాలు శరీరంలో ప్రతికూల ప్రతిచర్యలను కలిగిస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఇది మధుమేహం ముప్పును పెంచుతుందట.