ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. అవేంటంటే..
సాధారణంగా మనం కొన్ని పదార్థాలను మళ్లీ వేడి చేసుకుని తినేస్తుంటాం. ముఖ్యంగా చలికాలంలో పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి
సాధారణంగా మనం కొన్ని పదార్థాలను మళ్లీ వేడి చేసుకుని తినేస్తుంటాం. ముఖ్యంగా చలికాలంలో పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తుంటారు. మధ్యాహ్నం చేసిన వంటలు మిగిలినట్లయితే మళ్లీ వేడి చేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ప్రతి ఇంట్లో పద్దతి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. నిజానికి ఫ్రిజ్లో పెట్టిన పదార్థాలను మళ్లీ వేడి చేస్తే ఆరోగ్యానికి చాలా డేంజర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని పదార్థాలను కూడా వేడి చేసి తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
1. నాన్ వెజ్.. అంటే చికెన్, మటన్, గుడ్డు వంటి పదార్థాలలో పోషకాలు అధికంగా ఉంటాయి.. కానీ ఈ నాన్ వెజ్ వంటకాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదు. ఇలా చేయడం వలన జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. అధిక ప్రోటీన్ ఆహారంలో నైట్రోజన్ అధిక మొత్తంలో ఉంటుంది. దానిని మళ్లీ వేడి చేయడం ద్వారా హానికరం అవడమే కాకుండా ఇతర వ్యాధులను కలుగచేస్తుంది. 2. అన్నంను మళ్లీ వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అలాగే.. బాసిల్లస్ సెరియస్ అనే అత్యంత రెసిస్టెంట్ బ్యాక్టిరీయా బియ్యంలో పెరిగి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. 3. బంగాళదుంపలో విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. వీటిని పదే పదే వేడి చేయడం ద్వారా క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరిగి పోషకాలు నాశనమవుతాయి. 4. పుట్ట గొడుగులను ఉడికించిన తర్వాత ఒక రోజు తర్వాత నిల్వ చేయవద్దు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ మళ్లీ మళ్లీ వేడి చేయడం వలన ప్రస్తుతం ఇందులో ఉన్న ప్రోటీన్స్ నాశనమవుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే టాక్సిన్స్ ఉత్పత్తి చేస్తుంది. 5. బచ్చలి కూర, ఆకు కూరలు, క్యారెట్స్, టర్నిప్స్, దుంపలలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను వేడి చేయకూడదు. ఇలా చేయడం వలన ఇవి నైట్రేట్స్ గా మారి నేట్రోజెనేస్లుగా మారతాయి. ఇవి శరీర కణజాలానికి హానికరం. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
Also Read: Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన పూజా హెగ్డే..