AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే..

Pooja Hegde: రోజురోజుకీ తన పాపులారిటీతో పాటు సినిమా అవకాశాలను పెంచుకుంటూ దూసుకుపోతోంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమా 'ఒక లైలా కోసం' చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ...

Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే..
గత ఏడాది `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదల కాగా.. ఈపాటికే రాధేశ్యామ్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇది వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ కూడా విడుదలవుతుంది. 
Narender Vaitla
|

Updated on: Nov 23, 2021 | 7:21 AM

Share

Pooja Hegde: రోజురోజుకీ తన పాపులారిటీతో పాటు సినిమా అవకాశాలను పెంచుకుంటూ దూసుకుపోతోంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’ చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ అనంతరం తెలుగులో అగ్ర హీరోయిన్ల జాబితాలో ఒకరిగా పేరు దక్కించుకుంది. టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ దూసుకుపోతోందీ చిన్నది. ప్రస్తుతం రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ వంటి చిత్రాలతో బీజీగా ఉన్న పూజా బాలీవుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో మృతిక్‌ రోషన్‌ నటించిన మోహెంజో దారో చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాలో ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో కొన్ని రోజులపాటు తెలుగులోనే మంచి సినిమాలు చేస్తూ ఇక్కడ ఫుల్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా బీటౌన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది. పూజా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఈ వార్తలకు బలం చేకూర్చింది. బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ నటిస్తోన్న ఓ చిత్రంలో పూజా చాన్స్‌ కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా పూజానే అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే లొకేషన్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘లెజెండ్‌ హీరో అమితాబ్‌తో కలిసి నటించడం అనేది నా కల. చివరిగా ఆ కలను సాకారం చేసుకున్నాను. పూర్తి వివరాల కోసం ఎదురు చూడండి’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ సినిమా ఏంటన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: UGC NET Admit Card 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్స్.. అడ్మిట్ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

Zodiac Signs: ఈ 3 రాశుల వారు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారట.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Ratan Tata: అందుకే ఈ యువకుడి ప్రతిభకు రతన్‌ టాటా సైతం ఫిదా అయ్యారు..