AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే వెన్నతో ఇలా చేస్తే తగ్గినట్లే..

సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా చర్మం పొడి బారడడం.. నిర్జీవంగా

చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే వెన్నతో ఇలా చేస్తే తగ్గినట్లే..
Butter
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2021 | 9:43 AM

Share

సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా చర్మం పొడి బారడడం.. నిర్జీవంగా మారినట్లుగా అనిపించడం జరుగుతుంది. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు వెన్నను ఉపయోగించాలి. ఇందులో విటమిన్ ఇ ఉండడం వలన చర్మంపై వచ్చే పిగ్మెంటేషన్‏ను తగ్గించి.. ముఖంపై సహజమైన మెరుపును అందిస్తుంది. అలాగే ఇంట్లో తయారు చేసిన వెన్నలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‏ను నిర్వహించడంలో సహయపడుతుంది. అంతేకాకుండా చర్మంలో ముడతలు రాకుండా నివారిస్తుంది.. వెన్న మాయిశ్చరైజర్, యాంటీ మార్క్స్ క్రీమ్‏గా పనిచేస్తుంది. చలికాలంలో చర్మానికి వెన్నను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా.

ఇంట్లోనే వెన్న తయారీ.. రోజూ పాలలోని మీగడను తీసి ఫ్రీజ్ లో పెట్టాలి. 2 కప్పుల వరకు తీసి.. కనీసం 4 గంటలకు సాధారణ ఉష్ణోగ్రతలో పెట్టాలి. ఆ తర్వాత ఆ క్రీమ్‏తో కనీసం 2 కప్పుల చల్లటి నీటిని ఒక గిన్నె లో వేసి వేడి నీరు కలపాలి. బ్లెండింగ్ తర్వాత నీరు, క్రీమ్ విడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వెన్నను మరో గిన్నెలోకి తీసుకోవాలి.

వెన్నతో మాయిశ్చరైజర్.. ముందుగా ఇంట్లోనే వెన్న తయారు చేసి ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలపాలి. మెత్తటి పేస్ట్ గా మారిన తర్వాత దానిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ మాయిశ్చరైజర్‏ను ముఖంపై అప్లే చేసి.. 2 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి . పొడి చర్మం ఉన్నవారు రాత్రంతా వదిలేయ్యాలి.

ప్రయోజనాలు.. 1. వెన్నతో తయారు చేసిన ఈ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం ద్వారా చర్మం లోపల నుంచి హైడ్రేట్ గా ఉంటుంది. 2. ఇది చర్మానికి పూర్తి పోషణను అందిస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 3. వెన్నలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి మెరుగ్గా చేస్తుంది. 4. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడానికి, రక్షించడానికి సహాయపడతాయి. 5. ఇందులో ఉండే ఫాస్ఫోలిపిడ్ చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది మరియు సరిచేస్తుంది. 6. వెన్నలో విటమిన్ ఎ, ఇ మరియు రెటినోల్ ఉన్నాయి, ఇవి చర్మంలో కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి. 7. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు చర్మంపై ముడతలు మరియు ఫైన్ లైన్స్ కనిపించకుండా చేస్తుంది.

Also Read: Nithiin: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న నితిన్ ? .. వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో హీరో!..

Puneeth Rajkumar: పునీత్‌ బయోపిక్‌ తీయండంటూ దర్శకుడికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. డైరెక్టర్‌ ఎలా స్పందించాడంటే..