Tamarind Water Benefits: చింతపండు నీటిని ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్.. ప్రయోజనాలెంటో తెలుసుకోండి..
సాధారణంగా భారతీయ వంటకాలలో చింతపండును విరివిగా ఉపయోగిస్తుంటారు. సాంబార్, పప్పులలో తప్పనిసరిగా చింతపండు
సాధారణంగా భారతీయ వంటకాలలో చింతపండును విరివిగా ఉపయోగిస్తుంటారు. సాంబార్, పప్పులలో తప్పనిసరిగా చింతపండు ఉండాల్సిందే. కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చింతపండు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ చింతపండు నీరు ఉపయోగపడుతుంది. చింతపండు నీటితో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.
టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో చింతపండు నీరు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతు, చెంపల చుట్టు నొప్పి రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. టాన్సిల్స్ సమస్యలు ఉన్నవారు చింతపండు నీళ్లతో గార్గిల్స్ చేయాలి. అలాగే గొంతు మంటను తగ్గించడంలోనూ చింతపండు నీరు సహయపడుతుంది. పచ్చ కామెర్లను తగ్గిస్తుంది. చింతపండులో కాలేయ కణాలను సరిగ్గా చేసే లక్షణాలు ఉన్నాయి. కామెర్ల సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది.
రక్తహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది . చింతపండులో ఐరన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాకుండా.. శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. చింతపండు బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇందులో హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును బర్న్ చేయడం ద్వారా ఎంజైములను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువును తగ్గిస్తుంది. మొటిమలు.. దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. చింతపండులో నిమ్మరసం కలిపి శరీరంపై అప్లై చేయడం వలన మొటిమలు.. దద్దుర్లు సమస్య తగ్గుతుంది.
చింతపండు ఆకులు, పువ్వులు కూడా కడుపు సమస్యలను తగ్గిస్తుంది. లేత చింతపండు ఆకులను.. చింతపండు పువ్వులను కూరగాయ చేసి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సైనస్ సమస్య ఉన్నవారికి చింతపండు మేలు చేస్తుంది. సైనస్ సమస్య ఉన్నవారు చింతపండు ఆకుల రసాన్ని తాగితే సైనస్ సమస్య తగ్గుతుంది.
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..