Dry Ginger Benefits: ఎండిన అల్లంతో అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినొద్దు..
అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాగే ఎండిన అల్లం కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.
అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాగే ఎండిన అల్లం కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. పీచు, సోడియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక గుణాలు ఎండిన అల్లంలో ఉన్నాయి. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గి్స్తుంది. ఎండిన అల్లం జలుబు, దగ్గు తగ్గించడంలో సహయపడుతుంది. అలాగే కడుపు సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యను తగ్గించడమే కాకుండా.. ఆహారాన్ని జీర్ణం చేయడంలో పొడి అల్లం చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
కఫం సమస్యను తగ్గించడంలో ఎండిన అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వాతం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు సమస్యలు, తిమ్మిర్లు, లూజ్ మోషన్ వంటి సమస్యలు తగ్గించుకోవడానికి గోరు వెచ్చని నీటితో కలిపి ఎండిన అల్లం తీసుకోవాలి.
అలాగే ఎండు శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అజీర్తి, గ్యా్స్ సమస్య తగ్గుతుంది. ఆకలి మందగించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఎండు అల్లం పొడిని రాక్ సాల్డ్ లో కలిపి తింటే ఆకలి మందగించే సమస్య తగ్గుతుంది.
ఈ సమస్యలు ఉన్నవారు తినకూడదు.. ఎండు అల్లం వేడిని కలిగిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో పొడి అల్లం తీసుకోవద్దు. శరీరంలోని మంటలు లేదా ఏదైనా గాయం ఉన్నవారు ఎండు అల్లం అస్సలు తీసుకోవద్దు. ఎండకాలంలో ఎండు అల్లం అస్సలు తినకూడదు. జ్వరం వచ్చినప్పుడు ఎండిన అల్లం తీసుకోవద్దు.
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..