అతిగా నిద్రపోతున్నారా? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి..
ప్రస్తుతం అందరి జీవనశైలీ మారుతున్న క్రమంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 8 గంటలు
ప్రస్తుతం అందరి జీవనశైలీ మారుతున్న క్రమంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. 6 నుంచి 8 గంటలు నిద్రపోయే వారు ఎంతో ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉంటారని ఇప్పటికే పలు అద్యాయనాలు వెల్లడించాయి. అయితే 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేధిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయసున్న దాదాపు 32,000 మందిపై జరిగిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాల దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే.. తొమ్మిది గంటలు అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23 శాతం ఎక్కువని తెలీంది. అంటే తక్కువగా నిద్రపోయే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82 శాతం ఎక్కువని తెలీంది.
అయితే అతిగా నిద్రపోతే స్ట్రోక్ ప్రమాదం వస్తుంది.. అలాగే స్ట్రోక్ వచ్చినవారిలో నిద్రలేమి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీరిలో జ్ఞాపకశక్తి తగ్గడం.. విచారంగా ఉండడం వంటి సమస్యలు తెలెత్తుతున్నాయి. అయితే అతిగా నిద్రపోవడానికి.. స్ట్రోక్ రావడానికి మధ్య సంబంధం ఎలా ఉంది అనేది మాత్రం తెలియలేదు.. కానీ.. ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు.. బరువు పెరుగుతున్నాయని.. వీటివలన స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వెల్లడైంది. సరైన ఆహారం.. సరైన జీవనశైలి వలన స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. రోజూ వ్యాయమాలు చేయడం.. జంక్ ఫుడ్.. ధూమాపానం.. మద్యపానం మానుకోవడం తరచూ రక్తపోటు.. కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంవలన స్ట్రోక్ ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.
Also Read: Oke Oka Jeevitham: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ఒకే ఒక జీవితం.. ఆకట్టుకుంటున్న శర్వానంద్ న్యూ పోస్టర్..
Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే….