Sleep Health: నిద్రలో చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న నిపుణులు.. ఎందుకంటే..

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో అందరి జీవనశైలి మారిపోయింది. సమయానుగుణంగా తిండి, నిద్ర ఉండడం లేదు. ఫలితంగా చిన్న

Sleep Health: నిద్రలో చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న నిపుణులు.. ఎందుకంటే..
Sweating Deep Sleep
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 8:57 AM

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో అందరి జీవనశైలి మారిపోయింది. సమయానుగుణంగా తిండి, నిద్ర ఉండడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్స్ ముందు కూర్చోని ఉండేవారి గురించి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి స్క్రీన్ చూడడం వలన నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. నిజానికి సరైన నిద్ర లేకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అయితే కొందరికి బేడ్ పై వాలగానే నిద్రపట్టేస్తుంది. క్షణాల వ్యవధిలోన గాఢ నిద్రలోకి జారుకుంటారు.

అయితే కొందరికి నిద్రలో ఉన్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టేస్తుంటాయి. ఫ్యాన్, ఏసీ స్పీడ్ ఎంతలా పెంచినా.. నిద్రలో ఉన్నప్పడు మాత్రం చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటివారికి పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్టు అని అంటున్నారు నిపుణులు. మరీ అవవెంటో తెలుసుకుందామా.

నివేదికల ప్రకారం.. నిద్రలో ఉన్నప్పుడు చెమటలుు అధికంగా వస్తే టీబీ ఉన్నట్లు అని అర్థం. ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపించేది ఊపిరితిత్తులపైనే. వీరికి తరచూ విపరీతమైన చెమట వస్తుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంటారు. అందుకే నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా చెమట పడితే ముందుగు టీబీ టెస్ట్ చేయించుకోవాలి.

అలాగే క్యాన్సర్ వచ్చిన వారికి కూడా రాత్రిళ్లు చెమటలు అధికంగా వస్తుంటాయి. నివేదికల ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్స్ రాత్రి పూట చెమట్లు పట్టడం జరుగుతుంది. శరీరం క్యాన్సర్ తో పోరాడుతున్నప్పుడు రోగ నిరోధక వ్యసస్థ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిళ్లు జ్వరం రావడం.. చెమటలు పట్టడం జరుగుతుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి.. గ్యాస్ట్రోఇంటెస్టివల్ డిజార్డర్ కారణంగా రాత్రి నిద్రలో చెమటలు వస్తాయి. నిజానికి నిద్రిస్తున్నప్పుడు ఆహార గొట్టంలో తయారైన యాసిడ్ కడుపులో పేరుకుపోతుంది. దీంతో ఛాతీలో మంట.. చెమటలు పట్టడం జరుగుతుంది. రోజూ నిద్రలో చెమటలు వస్తున్నాయంటే.. ముందుగా మీరు టీబీ, గ్యాస్ పరీక్షలు చేయించుకోవాలి.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అధ్యాయనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ముందుగా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

Also Read: Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..