AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar: షుగర్ బాధితులు కందిపప్పు తింటే మంచిదా..? కాదా..? ఈ ప్రశ్నకు.. జవాబు ఇదే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ని నియంత్రించడానికి పప్పును తీసుకోవాలి. కంది పప్పు చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. పప్పు చక్కెరను ఎలా నియంత్రిస్తుంది.. దాని ఆరోగ్య ప్రయోజనాలను...

Blood Sugar: షుగర్ బాధితులు కందిపప్పు తింటే మంచిదా..? కాదా..? ఈ ప్రశ్నకు.. జవాబు ఇదే..
Toor Dal
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2022 | 8:11 PM

Share

క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి అనేక వ్యాధులకు దారి తీస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె , కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు మన దిగజారుతున్న ఆహారం, పేలవమైన జీవనశైలి ఫలితంగా వస్తున్నాయి. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక జబ్బు అని వైద్యులు అంటున్నారు. డయాబెటిస్ బాధితులు వారి ఆహారాన్ని జాగ్రత్తగా పల్ాన్ చేసుకోవాలి. డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఆహారం తీసుకోవాలి.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంలో తీసుకుంటే మంచిది. కాయగూరలు మన తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి డయాబెటిక్ పేషెంట్లు కూడా తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ని నియంత్రించడానికి పప్పును తీసుకోవాలి. కంది పప్పు చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. పప్పు చక్కెరను ఎలా నియంత్రిస్తుంది.. దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

డయాబెటిక్ రోగులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది

మీరు డయాబెటిస్ బాధితులైతే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో పప్పును చేర్చుకోవాలి. కంది పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ 29 ఉంటుంది. ఇది మధుమేహంతో బాధపడేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ పప్పులు మీ శరీరానికి చాలా శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్‌లకు మంచి మూలం అని వైద్య నిపులు సూచిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు పప్పు తింటే, వారి బ్లడ్ షుగర్ వేగంగా మారదు. పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా.. వారి చక్కర స్థాయిలను  నియంత్రించవచ్చు.

ఇవి కూడా చదవండి

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది

అరహార్ పప్పు జీర్ణక్రియలో సహాయపడే ఫైబర్ గొప్ప మూలం. ఇది మల విసర్జనను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం.. అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కంది పప్పు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పప్పులో మెగ్నీషియం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు దీనిని ఆహారంలో చేర్చుకుంటే.. వారి రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

అర్హర్ పప్పు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనయ్యే వ్యక్తులకు ఈ పప్పు ఉత్తమ ఆహారం. అర్హార్ పప్పులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై