Health: నిద్రలేమితో బాధపడుతున్నారా.? అయితే ఈ సెలబ్రిటీ యోగా ట్రైనర్‌ చెప్పే టిప్స్‌ పాటిస్తే సరి..

Health: నిద్రలేమి.. వినడానికి ఇది చిన్న సమస్యలాగే అనిపించినా దానితో ఇబ్బంది పడే వారు మాత్రం నరకం అనుభవిస్తారు. సరైన నిద్రలేకపోతే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Health: నిద్రలేమితో బాధపడుతున్నారా.? అయితే ఈ సెలబ్రిటీ యోగా ట్రైనర్‌ చెప్పే టిప్స్‌ పాటిస్తే సరి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 26, 2022 | 6:54 PM

Health: నిద్రలేమి.. వినడానికి ఇది చిన్న సమస్యలాగే అనిపించినా దానితో ఇబ్బంది పడే వారు మాత్రం నరకం అనుభవిస్తారు. సరైన నిద్రలేకపోతే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇందులో కొందరు మెడిసిన్స్‌ను కూడా ఆశ్రయిస్తారు. అయితే వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఎలాంటి మెడిసిన్స్‌తో పని లేకుండా యోగాతో నిద్రలేమికి చెక్‌ పెట్టొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా అన్షుక పర్వాణి అనే ప్రముఖ సెలబ్రిటీ యోగా ట్రైనర్ నిద్రలేమికి చెక్‌ పెట్టడానికి ఓ యోగా ట్రిక్‌ చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మొత్తం ఐదు ఆసనాల ద్వారా నిద్రలేమి (ఇన్‌స్నోమియా) సమస్య నుంచి బయపటపడొచ్చు. ఆమె వీడియోలో పేర్కొన్న ఐదు ఆసనాల్లో.. ఉత్తానాస‌నం , బ‌ట‌ర్ ఫ్లై పోజ్‌, విప‌రీత క‌ర‌ణి, స‌ర్వంగాస‌నం, భ్రమ‌రీ ప్రాణాయామం ఉన్నాయి. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన అన్షుక పర్వాణి.. ‘నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.? ప్రస్తుతం చాలా మంది.. ముఖ్యంగా యువకులు నిద్రలేమితో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌డానికి యోగా ఉపయోగపడుతుంది. ఇది మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అర్థరాత్రి వరకు సోషల్‌ మీడియా చూడడం మానేసి యోగాసనాలను సాధన చేయండి. తేడా మీకే తెలుస్తుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు.

ఇవి కూడా చదవండి

ఎవరీ అన్షుక పర్వాణి..

అన్షుక పర్వాణి ఈమె కరీనా కపూర్‌తో పాటు అలియా భ‌ట్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, అన‌న్య పాండే వంటి వారికి ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. హీరోయిన్లతో కలిసి చేసే యోగా సెషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్‌ చేయడంతో అన్షుకకు భారీగా ఫాలోవర్స్‌ పెరిగింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా నిద్రలేమితో సతమతమవుతున్నారా.? అయితే వెంటనే ఈ ఆసనాలను ట్రై చేయండి..

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?