AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control: షుగర్ బాధితులు స్వీట్స్ తింటే.. ఆ తర్వాత రోజు ఇలా చేయండి..

Blood Sugar: సరైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Diabetes Control: షుగర్ బాధితులు స్వీట్స్ తింటే.. ఆ తర్వాత రోజు ఇలా చేయండి..
Diabetes
Sanjay Kasula
|

Updated on: Jun 24, 2022 | 8:31 PM

Share

డయాబెటిస్‌ను నియంత్రించకపోతే శరీరంలో అన్నింటిని క్షీణింప చేస్తుంది. సరైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు డయాబెటిస్ బాధితులైతే.. ముందుగా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోండి. అప్పుడే మీరు భవిష్యత్తులో మూత్రపిండాలు, గుండె, నరాల దెబ్బతినడం వంటి సమస్యలు మీ వరకు రాకుండా కాపాడుకోవచ్చు. మీకు మధుమేహం ఉన్నప్పటికీ.. స్వీట్లు తింటున్నట్లైతే..  మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోండి. తద్వారా మీరు చక్కెరను నియంత్రించవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు స్వీట్లు తింటే షుగర్ ఎలా అదుపులో ఉంటుందో తెలుసుకుందాం.

శరీరాన్ని చురుగ్గా ఉంచుకోండి: మధుమేహాన్ని నియంత్రించాలంటే శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. శరీరం శారీరకంగా చురుగ్గా ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి మీరు వ్యాయామం చేయండి.

బరువు తగ్గండి : బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు అధిక బరువుతోపాటు మధుమేహాం ఉన్నట్లైతే దానిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. షుగర్ పేషెంట్లు స్వీట్లు తింటే.. వారి బరువు కూడా వేగంగా పెరుగుతుంది. షుగర్ కూడా వేగంగా పెరుగుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గడానికి.. ఏరోబిక్ వ్యాయామం, నడక చేయండి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం అంటే మీరు సోమరితనంకు దూరంగా ఉండండి.

మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోండి : మొక్కల ఆధార ఆహారం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మొక్కల ఆధారిత ఆహారాలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఈ ఆహారాలు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, పాలకూర, బచ్చలికూర, ఉసిరికాయ, మెంతులుతోపాటు ఆకు కూరలు, పొట్లకాయ,  క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఉల్లిపాయలు, ఓక్రా, టొమాటో, పుట్టగొడుగు వంటి పిండి లేని కూరగాయలను మొక్కల ఆహారంలో చేర్చవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి: మీరు డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినండి. బ్రోకలీ మొలకలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు లేదా అవిసె గింజలను ఆహారంలో చేర్చండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే