AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. బహిరంగ సభ వేదిక వద్ద బండి సంజయ్ భూమి పూజ..

వచ్చే ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనుంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదిక నిర్మాణం కోసం..

Bandi Sanjay: మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. బహిరంగ సభ వేదిక వద్ద బండి సంజయ్ భూమి పూజ..
Bandi Sanjay
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2022 | 3:05 PM

Share

భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. వచ్చే ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనుంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదిక నిర్మాణం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భూమి పూజ చేశారు. జూలై రెండో, మూడు తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల తర్వాత భారీ హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ జెండాలు ఎగురుతున్నాయి. బ్యారికేడ్ల నిర్మాణానికి కావాల్సిన సామగ్రి ఇప్పటికే పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

అయితే ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడారు..  మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండని అన్నారు. అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చారు.. మార్పు కోసం బిజెపికి ఈసారి ఇవ్వండి. బిజెపిని అణచివేయడానికి ఒక ప్రత్యేక శాఖ పెట్టిన అయన ఏమి చేయలేకపోతున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు.. టీఆర్ఎస్ కు డౌన్ ఫాల్ మొదలైందన్నారు. ప్రజలే సీఎం కేసీఆర్ ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మా నాయకుడు వస్తుంటే మేము సభ పెట్టుకుంటే మీకేం ఇబ్బందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పెడుతున్నామని భయపడుతున్నారు. ప్రజలకు మా సిద్ధాంతాలు, అభివృద్ధి పనులను వివరించేందుకు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా మోడీ సభకు రావాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ వాళ్లు ఎన్నికలు వస్తున్నాయని డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవ చేశారు.

ఇదిలావుంటే.. తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తవి మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC)కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులు, కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం.. 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బండి సంజయ్‌ వివరించారు.

తెలంగాణ వార్తల కోసం