Telangana: పల్లెవెలుగు బస్సుకు ఒక్కసారిగా ఎదురొచ్చిన అనుకోని అతిథి.. హడలిపోయిన ప్రయాణికులు

తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం కలకలం రేపుతోంది. కాకినాడ, విజయనగరం జిల్లాల్లో పులుల సంచారం గురించి ఇప్పటివరకు వార్తలు రాగా.. తాజాగా తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం గుబులు రేపుతోంది.

Telangana: పల్లెవెలుగు బస్సుకు ఒక్కసారిగా ఎదురొచ్చిన అనుకోని అతిథి.. హడలిపోయిన ప్రయాణికులు
Tiger Spotted
Ram Naramaneni

|

Jun 26, 2022 | 5:33 PM

కాకినాడ(Kakinada), విజయనగరం(Vizianagaram) జిల్లాల్లోనే కాదు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో(Jayashankar Bhupalpally District)నూ ఒక పులి సంచరిస్తోంది. రోడ్డు దాటుతున్న పులిని మంచిర్యాల నుంచి భూపాలపల్లికి వెళ్తున్న పల్లెవెలుగు బస్సు డ్రైవర్‌, ప్రయాణికులు చూశారు. కమలాపూర్- బాంబుల గడ్డ వద్దకు రాగానే పులి రోడ్డు దాటుతూ కన్పించింది. గమనించిన బస్సు డ్రైవర్ రమేశ్ వెంటనే సడెన్‌గా బ్రేక్ వేశాడు. బస్సుపై దాడి చేస్తుందేమో అన్న ఉద్దేశంతో పాసింజర్లను అలెర్ట్ చేశారు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాక్‌కు గురవ్వడం వల్ల ఎవరు ఫొటోలు, వీడియోలు తీయలేకపోయామని పాసింజర్స్ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అటవీ అధికారులకు తెలియజేయడంతో వాళ్లు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపులి అడుగుజాడలను అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రలు కనిపించిన ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో పక్షుల అరుపులను బట్టి అక్కడ పులి ఉన్నట్టు అధికారులు నిర్థారించారు. ఈ పులి పాదముద్ర పొడవు పద్నాలుగున్నర సెంటీమీటర్లుగా ఉంది, వెడల్పు సుమారు 10 సెంటీమీటర్లుగా ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులిని గుర్తించి.. బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎటువైపు వెళ్తుంది..? ఎన్ని రోజులుగా జిల్లా అడవుల్లో సంచరిస్తుందనే విషయాలు తేలాల్సి ఉంది.

తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu