Mushrooms: ఆందోళన.. ఒత్తిడిని తగ్గించే పుట్టగొడుగులు.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..
పుట్టగొడగులు...ఆరోగ్యానికి మంచివి.. అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా... శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి.
పుట్టగొడగులు…ఆరోగ్యానికి మంచివి.. అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా… శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. వీటితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు. శాకాహార ప్రియులకు ఇష్టమైన ఫుడ్. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరానికి వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులను నియంత్రిస్తాయి. అంతేకాకుండా.. పుట్టగొడుగులు ఒత్తిడి.. ఆందళనను తగ్గిస్తాయి. ఇవే కాకుండా.. ఇతర వ్యాధుల చికిత్సలోనూ ఇవి ఉపయోగపడతాయి. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మిడిసిన్ పరిశోధకులు.. 2400 మంది ఆహారం, ఆరోగ్య డేటా విశ్లేషణ ఆధారంగా పుట్టగొడుగులు తినే వ్యక్తులు డిప్రెషన్ వంటి సమస్యల లక్షణాలు తక్కువగా ఉన్నట్లుగా నిరూపించారు.. దాదాపు ఒక దశాబ్దం పరిశోధనలో పుట్టగొడుగులను తీసుకొని వారు ఎక్కువగా డిప్రెషన్ అయ్యేవారని తేలీంది.
ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ జాషువా మస్కట్ మాట్లాడుతూ.. పుట్టగొడుగులను తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. పుట్టగొడుగులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అమైనో ఆమ్లాలు కనిపిస్తాయని దీంతో ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు.. ఎర్గోథియోనిన్ పుట్టగొడుగులలో ఉంటుందని నిపుణులు సూచిస్తన్నారు. ఇందులో ఉంటే అమైనో ఆమ్లం మానవ శరీరంలో తయారు చేయబడలేదని.. కేవలం పుట్టగొడుగులలో మాత్రమే కనిపిస్తుందని… అధిక స్థాయి ఎర్గోథియోనిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు..
ఇక గత అధ్యయనాలు కూడా పుట్టగొడుగుల వినియోగం స్కిజోఫ్రెనియా ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపాయి.. ఇవి బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అదనపు పొటాషియం తెల్ల పుట్టగొడుగులో ఉంటుంది, ఇది ఆందోళనను తొలగిస్తుంది. అయితే డిప్రెషన్‌ను నివారించడానికి ఎలాంటి పుట్టగొడుగులను తినాలో పరిశోధకులు చెప్పలేదు. ఒక అధ్యయనంలో పుట్టగొడుగులలో సైలోసిబిన్ అనే సమ్మేళనం ఉన్నట్లు తెల్చారు. ఇది మెదడులోని న్యూరాన్ కనెక్టివిటీని 10 శాతం పెంచుతుంది. అలాగే పుట్టగొడుగులలో ఉండే సెలీనియం, ఎర్గోథియోనిన్ అనే మూలకాలు క్యాన్సర్‌తో పోరాడడంలో కూడా ఎక్కువగా పనిచేస్తాయి.. విటమిన్ ఎ, బి , సి కూడా పుట్టగొడుగులలో పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతాయి. క్యాన్సర్ రావడానికి ఫ్రీ రాడికల్స్ అతిపెద్ద కారణం.