Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిల్ పొందిన సీలబ్రిటీల గురించి తెలుసా?
షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి అక్టోబర్ 2 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది.
Cruise Drugs Case: షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి అక్టోబర్ 2 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. విచారణ తర్వాత, ఆర్యన్‌ను అక్టోబర్ 8 న ఆర్థర్ రోడ్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. న్యాయవాదులు పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపధ్యంలో గతంలో మాదకద్రవ్యాల కేసులో చిక్కుకుని కొన్ని గంటల్లో బెయిల్ పొందిన అదేవిధంగా నెలలపాటు బెయిల్ దొరకక జైల్లోనే ఉండిపోయిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతనికి డ్రగ్స్ సరఫరా చేసిన పలువురు డ్రగ్ పెడ్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో, సుశాంత్ అప్పటి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షావిక్ చక్రవర్తి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు చిక్కుకున్న తర్వాత రియా చక్రవర్తిని సెప్టెంబర్ 7 న ఎన్‌సిబి విచారించింది. ఒక నెల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నటి బెయిల్‌పై విడుదలైంది.
విజయ్ రాజ్
బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్ కూడా డ్రగ్స్‌తో పట్టుబడినందుకు జైలు శిక్ష అనుభవించాడు. విజయ్ తన వద్ద డ్రగ్స్ ఉంచినందుకు దుబాయ్ ఎయిర్‌పోర్టులో జైలు పాలయ్యాడు. అయితే, విచారణ తర్వాత, అతను నిర్దోషిగా నిర్ధారణ కావడంతో విడుదలయ్యాడు. ఈ కేసులో విజయ్‌ని ఒక రోజు కస్టడీలో ఉంచారు.
ఫర్దీన్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ 2001లో జుహు ప్రాంతంలో డ్రగ్ డీలర్ నుండి కొకైన్ కొనుగోలు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఫర్దీన్ 5 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. అతని కేసు 10 సంవత్సరాల పాటు కొనసాగింది. మాదకద్రవ్యాల బానిస అయిన ఫర్దీన్‌ను పునరావాస కేంద్రానికి పంపారు. అక్కడ అతను పూర్తిగా వ్యసనం నుండి బయటపడ్డాడు. 2011 లో, ఫర్దీన్ తనపై కొనసాగుతున్న విచారణను నిలిపివేయడానికి ఎన్డీపీఎస్ (NDPS) కోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేశాడు. దీనిని కోర్టు ఆమోదించింది. దీంతో ఆ కేసు మూసివేశారు.
భారతి సింగ్ – హర్ష్ లింబాచియా
గత ఏడాది నవంబర్ 21 న హాస్య నటుడు భారతీ సింగ్,ఆమె భర్త హర్ష్ లింబాచియా ఇంటిపై ఎన్‌సిబి దాడి చేసింది. దాడిలో, వారి అంధేరి ఇంటి నుండి 86.50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఇద్దరికీ బెయిల్ లభించింది, విచారణలో ఇద్దరూ గంజాయి సేవించినట్లు అంగీకరించారు.
అర్మాన్ కోహ్లీ
డ్రగ్స్ విక్రేత అజయ్ రాజు విచారణలో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ పేరు వినిపించింది. దీంతో ఆగస్టులో అతని జుహు నివాసంలో సోదాలు జరిగాయి. ఈ దాడిలో అర్కన్ ఇంటి నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఎన్‌సిబి ఆగస్టు 29 న అరెస్టు చేసింది. అప్పటి నుండి అర్మాన్ అదుపులో ఉన్నాడు. నటుడి న్యాయవాదులు అతని బెయిల్ కోసం నిరంతరం దరఖాస్తు చేస్తున్నారు. అయినప్పటికీ, అతని బెయిల్ దరఖాస్తును అనిసార్లూ కోర్టు తిరస్కరించింది.
గౌరవ్ దీక్షిత్
టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ ఇంట్లో జరిగిన దాడిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం చరస్‌ను స్వాధీనం చేసుకుంది. ఆగస్టు 28 న జరిగిన దాడి తర్వాత కోక్ గౌరవ్‌ను అరెస్టు చేశారు. సుమారు 27 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, గౌరవ్ రూ .50,000 వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యాడు.
షబానా సయీద్
బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాద్వాల్ భార్య షబానా సయీద్ కూడా డ్రగ్ కేసులో అరెస్టయ్యారు. గత ఏడాది నవంబర్ 8 న, ఫిరోజ్ ఇంట్లో జరిగిన దాడిలో ఎన్‌సిబి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అతని భార్య పేరు కేసులో బయతాకు వచ్చింది. అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత నవంబర్ 10 న షబానాకు రూ .15,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది.
Also Read: AP News and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..