Sharukh Khan-Aryan Khan: అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి.. కొడుకు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న షారుఖ్..(వీడియో)
తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో.. షారుఖ్ తీవ్రంగా కలత చెందారట. కొంత కాలంగా తన బిజీ షెడ్యూల్ ను పక్కకు బెట్టి మరీ ఆర్యన్ సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఉన్నట్టుండి ఇలా జరగడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారట. ఇప్పుడిదే విషయం బీ టౌన్‌లో వైరల్ అవుతోంది...
తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో.. షారుఖ్ తీవ్రంగా కలత చెందారట. కొంత కాలంగా తన బిజీ షెడ్యూల్ ను పక్కకు బెట్టి మరీ ఆర్యన్ సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఉన్నట్టుండి ఇలా జరగడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారట. ఇప్పుడిదే విషయం బీ టౌన్‌లో వైరల్ అవుతోంది.ఆర్యన్ ఖాన్‌ను త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇప్పించేందుకు షారుఖ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్టు కావడంతో షారుఖ్ ప్లాన్స్ తలకిందులయ్యాయి. దీంతో ఆర్యన్ కెరీర్ పరంగా షారుఖ్ ఎటూ తేల్చుకోలేక తీవ్ర మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా తనయుడు ఆర్యన్ అరెస్టు కంటే.. అతని భవిష్యత్తు, కెరీర్‌పై ఆలోచనలే షారుఖ్‌ను ఎక్కువ ఇబ్బందిపెడుతున్నాయట.
ఇక ఆర్యన్‌కు త్వరలోనే కోర్టులో బెయిల్ లభిస్తుందని షారుఖ్ ఖాన్ కుటుంబీకులు ఆశిస్తున్నారు. ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యాక షారుఖ్ ఈ వ్యవహారంపై ఓ ప్రకటనల విడుదల చేసే అవకాశముందని సమాచారం. డ్రగ్స్ కేసు వ్యవహారం నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కొంతకాలం అమెరికా లేదా బ్రిటన్‌లో నివసించే అవకాశముందని కూడా బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో కోర్టు షరతులకు లోబడి షారుఖ్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఎపిసోడ్ దెబ్బకు ఆయన తండ్రి షారుఖ్ ప్రతిష్ట మసకబారడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : shriya saran: చంటి బిడ్డతో అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన శ్రీయ.. భర్త , చంకన ఓ చంటి బిడ్డతో షాక్ ఇచ్చిన శ్రీయ..(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

