Aryan Khan: పేదలకు చేయూతనిస్తా.. తప్పుడు మార్గంలో నడవను.. షారుఖ్ కొడుకు ఆర్యన్ హామీ..
Cruise Drugs Case - Aryan Khan: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కార్డిలా క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు
Cruise Drugs Case – Aryan Khan: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కార్డిలా క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత, ఆర్యన్‌ను అక్టోబర్ 8న ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం న్యాయవాదులు బెయిల్ కోసం పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ముంబై కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ అధికారులు జైలులో విచారణతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆర్యన్ అధికారులతో పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచి విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు ఇకనుంచి చేయబోనని ఆర్యన్ ఖాన్ వెల్లడించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకనుంచి చెడు మార్గంలో ఇక పయనించనంటూ వెళ్లనని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శనివారం ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేకు హామీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.
ఈనెల 2న ఓ క్రూయిజ్ నౌకలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేశారు. అనంతరం అక్టోబర్ 7న ఆర్యన్ ఖాన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో ఆర్యన్ కు నిర్వహించిన కౌన్సిలింగ్‌లో పలు అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. పేదలు, అణగారిన వర్గాలకు చేయూతనిస్తానని.. ఏదో ఒకరోజు తనను చూసి గర్వపడేలా చేస్తానంటూ అధికారులకు ఆర్యన్ మాటిచ్చాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: