AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం!

ఈ పండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది. చర్మంపై ముడతలు మాయమవుతాయి. కడుపు సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా కడుపులోని అల్సర్‌లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

Health Benefits: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం!
Kiwi Fruit
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2022 | 9:29 PM

Share

ఇది ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండు. దీన్ని సూపర్‌ఫుడ్ కేటగిరీలో ఉంచడం బహుశా తప్పు కాదు. ఎందుకంటే ఇందులో మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మార్కెట్‌లో దీని ధర అనేక ఇతర పండ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, దానిని కొని తినడం వల్ల పెట్టిన ధరకు రెట్టింపు ఆరోగ్య ప్రయోజనం కలుగుతుంది. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఈ పండు వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు శరీరానికి అందుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

గుండె జబ్బులు ఉన్నవారు సాధారణంగా కివీని తినడం మంచిది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఖచ్చితంగా కివీ పండు తింటే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఇది కేలరీలు తక్కువగా ఉన్నందున, ఇది డయాబెటిక్ రోగులకు ఏ ఇతర ఔషధాల కంటే తక్కువ ప్రభావవంతమైనది కాదు. ఇది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కివి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని సానుకూల ప్రభావం మన చర్మంపై కనిపించడం ప్రారంభిస్తుంది.

కివీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది. చర్మంపై ముడతలు మాయమవుతాయి. కడుపు సమస్యలు ఉన్నవారు కివీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా కడుపులోని అల్సర్‌లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కివిలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.ఇది మన ఎముకలకు కూడా మేలు చేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని తినాలి. కివి మన రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుంది. ఇది అనేక వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటు నియంత్రణలో కివీ పండ్లు బాగా పనిచేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను కివీ పండ్లు తగ్గిస్తాయి. పడుకోడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపడుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..