AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypothyroidism: అధిక అలసటకు కారణం హైపోథైరాయిడిజం.. ఇంకా అవన్నీ దీని లక్షణాలే.. తస్మాత్ జాగ్రత్త!

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంధి లోపం కారణంగా అన్ని వయసుల వారిలోనూ లింగ బేధం లేకుండా సమస్య కనిపించవచ్చు. హైపోథైరాయిడిజం లక్షణాలలో అలసట,..

Hypothyroidism: అధిక అలసటకు కారణం హైపోథైరాయిడిజం.. ఇంకా అవన్నీ దీని లక్షణాలే.. తస్మాత్ జాగ్రత్త!
Hypothyroidism
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2022 | 8:49 PM

Share

హైపోథైరాయిడిజం : రాత్రి పూట హాయిగా నిద్ర పోయినా మీరు తరచుగా అలసిపోయినట్లుగా భావిస్తున్నారా ? మీరు తీసుకునే ఆహారంలో పెద్దగా మార్పులేవీ లేకున్నా బరువు పెరిగారా ? అయితే మీ శరీరం మీకు చేస్తోన్న హెచ్చరికల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ డాక్టర్‌ను సంప్రదించి హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారామో పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతి సహజంగా ఎదుర్కొంటున్న హార్మోన్ల సమస్యలలో మధుమేహం తరువాత కనిపిస్తోన్నది థైరాయిడ్‌ సమస్యలు. మెడ కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంధి మనం తీసుకునే ఆహారంలో ఆయోడిన్‌ వినియోగించుకుని ట్రైఅయోడోథైరనిన్‌ (టీ3), థైరోక్సిన్‌ (టీ4) తయారుచేస్తుంది. ఈ గ్రంధి సక్రమంగా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది థైరాయిడ్‌ వ్యాథులతో బాధపడుతున్నారని అంచనా. తగినంతగా థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయని ఎడల హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. ఆహారంలో అయోడిన్‌ తక్కువ పరిమాణంలో శరీరానికి లభించడం, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్లు, అయోడిన్‌ లోపం వంటివి హైపోథైరాయిడిజంకు కారణాలు. అయితే, వైద్య చికిత్స పరమైన సమస్యలు, సర్జరీ, జన్యుపరమైన వ్యాధులు, రేడియేషన్‌ లేదా పిట్యుటరీ లోపాల వల్ల కూడా సంభవించే అవకాశాలున్నాయి.

మహిళలకు హైపోథైరాయిడిజం అధికంగా వచ్చే అవకాశాలు భారతదేశంలో అధికంగా కనిపిస్తోన్న థైరాయిడ్‌ సమస్యలలో హైపోథైరాయిడిజం ఒకటి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంధి లోపం కారణంగా అన్ని వయసుల వారిలోనూ లింగ బేధం లేకుండా సమస్య కనిపించవచ్చు. హైపోథైరాయిడిజం లక్షణాలలో అలసట, చల్లటి పదార్ధాలు తింటే తేడా చేయడం, చర్మం, జుట్టు పొడి బారడం, డిప్రెషన్‌, మతిమరుపు, మలబద్ధకం, కండరాలు పట్టేయడం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి. దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే సంతానలేమి, ఋతుక్రమం సరిగా ఉండకపోవడం, గర్భిణిలైతే గర్భస్రావం జరగడం వంటివి జరగొచ్చు. డాక్టర్‌ను సంప్రదించిన తరువాత టీఎస్‌హెచ్‌, టోటల్‌ టీ4 పరీక్షల ద్వారా హైపోథైరాయిడిజం నిర్థారిస్తారు. హైపోథైరాయిడిజం నిర్వహణ హైపోథైరాయిడిజం అనేది జీవితాంతం ఉంటుంది. కాకపోతే మందులతో దానిని నిర్వహించడం సులభం. తగిన చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఉదయం నిద్ర లేచిన తరువాత ఖాళీ కడుపుతో ఈ టాబ్లెట్‌ తీసుకోవాలి. మాత్ర వేసుకున్న తరువాత కనీసం అరగంట అయినా ఏమీ తినకూడదు. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుని సరైన మోతాదులో మందులు వాడాలి. మోతాదు మించితే ఎముకలు, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

– డాక్టర్‌ బిపిన్‌ కుమార్‌ సేథీ, డీఎం ఎండోక్రినాలజీ, కన్సల్టెంట్‌ ఎండోక్రినాలజిస్ట్‌ కేర్‌ హాస్పిటల్‌ మరియు తపాడియా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..