Chennai: కాలేజీ విద్యార్థినిపై ఉబర్ ఆటో డ్రైవర్ అఘాయిత్యం..సోషల్ మీడియా వేదికగా బాధితురాలి ఆవేదన..
ఆదివారం రాత్రి విద్యార్థిని ఇషితా సింగ్ తన స్నేహితురాలితో కలిసి హోటల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను ట్విట్టర్‌లో వివరించిన మహిళ.. తాను రెస్టారెంట్ నుంచి..
చెన్నైలో ఓ విద్యార్థినిని వేధించిన ఉదంతం వెలుగు చూసింది. ఉబెర్ ఆటోరిక్షా డ్రైవర్ కాలేజీ విద్యార్థినిని వేధించాడని, ఆమె గట్టిగా అరవటంతో అతడు తన ఆటోరిక్షాను వదిలి పారిపోయాడని చెబుతున్నారు. ఆదివారం రాత్రి విద్యార్థిని ఇషితా సింగ్ తన స్నేహితురాలితో కలిసి హోటల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను ట్విట్టర్‌లో వివరించిన మహిళ.. తాను రెస్టారెంట్ నుంచి సెమంచెరిలోని హోటల్‌కు ఉబర్ ఆటోరిక్షా రైడ్‌ను బుక్ చేసుకున్నట్లు తెలిపింది. హోటల్‌కు చేరుకున్న తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆటో దిగిన వెంటనే డ్రైవర్ ఆమెను అసభ్యంగా తాకాడని ఆరోపించాడు. తమిళనాడు పోలీసులను ట్యాగ్ చేస్తూ, “ఐబిస్ ఓఎంఆర్ హోటల్ సమీపంలో సెల్వం అనే ఉబెర్ ఆటో డ్రైవర్ తనను అసభ్యంగా తాకాడంటూ బాధితురాలు పేర్కొంది.
30 నిమిషాల తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత ట్వీట్‌లో ఆమె గట్టి గట్టిగా అరవటంతో డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడని చెప్పాడు. సంఘటన తర్వాత తాను పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని బాధితురాలు వాపోయింది. 30 నిమిషాల తర్వాత ఓ పోలీసు మరో వ్యక్తితో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. కానీ అక్కడ లేడీ పోలీసు లేరు.. స్టేషన్‌లో మహిళా అధికారి లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఉదయం వరకు వేచి ఉండాలని కోరారని చెప్పింది.. ఆఫ్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వెళ్తుంటే.. వారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుండి వెళ్లనివ్వడం లేదని చెప్పింది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు వారిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. ఎందుకంటే రాత్రిపూట మహిళలను పోలీస్ స్టేషన్‌లలోకి అనుమతించరు.
I’m a student journalist at @ACJIndia, Chennai. An @Uber Auto driver named Selvam ,sexually assaulted me by pressing my right breast, near Ibis OMR Hotel, when my friend and I returned from East Coast Madras to the hotel.@PoliceTamilnadu pic.twitter.com/jJMhx4zk5j
— Ishita Singh (@IshitaS05978134) September 25, 2022
ఆ మహిళ ఆటోరిక్షా ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఆమె చేసిన నగదు లావాదేవీ, పేరు డ్రైవర్‌ను కూడా ఫోటో తీసి షేర్ చేసింది. ఈ ట్వీట్‌లపై తాంబరం పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉబెర్ ఇండియా కూడా ఈ సంఘటనను గుర్తించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి