AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: ఉదయం ఈ తప్పు చేస్తున్నారు! కిడ్నీలు పోగొట్టుకుంటున్నారు..

ఉదయం మన దినచర్యను ఎలా ప్రారంభిస్తాము అనే దానిపైనే మన రోజు మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే, మనం నిత్యం చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు తెలియకుండానే మన కీలక అవయవాలైన మూత్రపిండాలకు (Kidneys) హాని కలిగిస్తుంటాయి. మీరు తాగే నీటి నుండి మొదలుకుని, మీ అల్పాహారం వరకు ప్రతి చిన్న ఎంపిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చెన్నైకి చెందిన ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం ఉదయం పూట మూత్రపిండాలకు హాని కలిగించే 5 సాధారణ అలవాట్లు ఏమిటో, వాటిని ఎలా నివారించాలో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నారు.

Kidney Health: ఉదయం ఈ  తప్పు చేస్తున్నారు! కిడ్నీలు పోగొట్టుకుంటున్నారు..
Kidney Damage Habits
Bhavani
|

Updated on: Oct 19, 2025 | 3:38 PM

Share

మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయం పూట కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోకూడదు అని చెన్నై యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం హెచ్చరించారు. ఉదయం పూట చేసే 5 సాధారణ అలవాట్లు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు:

ఉదయం నీరు త్రాగకపోవటం: రాత్రి వేళ ఉపవాసం తర్వాత మన శరీరం, కిడ్నీలు కొద్దిగా డీహైడ్రేషన్ గురవుతాయి. కాఫీ, టీ తాగే ముందు కనీసం ఒక గ్లాసు నీటితో రోజు ప్రారంభించండి అని డాక్టర్ వెంకట్ తెలిపారు.

మూత్రాన్ని ఆపుకోవటం: రాత్రంతా మూత్రాన్ని ఆపుకోవటం వలన మూత్రాశయం సాగిపోయి, ఖాళీ చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఉదయం పూట లేక పగలైనా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోకూడదు. ఇది కిడ్నీలపై, మూత్రాశయంపై ఒత్తిడి పెంచుతుంది.

ఖాళీ కడుపుతో పెయిన్‌కిల్లర్స్: పెయిన్‌కిల్లర్స్ సరైన పద్ధతిలో తీసుకోకపోతే కిడ్నీలకు హాని చేస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఈ ప్రమాదం పెరుగుతుంది. ఎప్పుడూ సూచనలు పాటించి, ఆహారం లేక నీటితో వాటిని తీసుకోండి.

వ్యాయామం తర్వాత హైడ్రేషన్ లేకపోవటం: ఉదయం వ్యాయామం చేయటం మంచిది. కానీ పోస్ట్-వర్కౌట్ హైడ్రేషన్ అంత ముఖ్యం. నీరు తాగటం వలన కిడ్నీలు టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. డీహైడ్రేషన్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.

అల్పాహారం మానేయటం: డాక్టర్ వెంకట్ ఉదయం పూట ప్రోటీన్ అధికంగా ఉన్న ఆరోగ్యకరమైన అల్పాహారం తినమని సిఫార్సు చేస్తున్నారు. అల్పాహారం మానేస్తే అధికంగా ఉప్పు ఉన్న స్నాక్స్ తినే అవకాశం ఉంది. ఈ అధిక సోడియం కిడ్నీలపై ఒత్తిడి పెడుతుంది.

ఈ సాధారణ చిట్కాలు పాటించటం వలన మీ ఉదయాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుకోవచ్చు. మీ కిడ్నీలను కూడా రక్షించుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన ఆరోగ్య సమాచారం చెన్నై యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ వివరాలను నిపుణుల సలహాగా పరిగణించాలి, కానీ ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.