Jeera Water: బరువు తగ్గేందుకు జీలకర్ర నీరు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Cumin Seed Benefits: వంటగదిలో ఉండే జీలకర్రలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. జీలకర్ర ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Cumin Seed Benefits: వంటగదిలో ఉండే జీలకర్రలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. జీలకర్ర ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీలకర్రలో క్రిమినాశక గుణాలు ఎక్కువగా ఉన్నాయని, ఇది గాయాలు లేదా వాపులను త్వరగా మాన్పుతుందని పేర్కొంటారు. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం.. దానిని బలోపేతం చేయడానికి తప్పనిసరిగా తినడం మంచిది. జీలకర్ర (jeera) లోని మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అనేక యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పొట్ట, కాలేయంలో ఏర్పడే ట్యూమర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే.. జీలకర్ర నీరు బరువును తగ్గించడంలో బాగా ప్రభావం చూపుతుంది. ఈ జీలకర్ర నీటిని సరైన మార్గంలో తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
చాలా మంది బరువు తగ్గడం కోసం జీలకర్ర నీటిని తీసుకుంటారు. కానీ ఈ సమయంలో వారు చాలా తప్పులు చేస్తారు. జీలకర్ర నీరు తాగడానికి సరైన మార్గం.. దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకోండి..
బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందంటే..
శరీరంలో అవాంఛిత బరువు పెరగడం వల్ల వీపు వైపు వాపు ఏర్పడుతుంది. అయితే.. జీలకర్ర నీరు శరీరం నుంచి వీటిని తొలగించడానికి పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గే సమయంలో, జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. జీలకర్ర జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీలకర్ర నీరు తాగడానికి సరైన మార్గం
చాలా మంది జీలకర్ర నీటిని తప్పుడు మార్గంలో తాగుతారు.. అందుకే వారు ఆశించిన ఫలితాలు పొందలేరు. జీలకర్రను నీటిలో ఉంచి తాగితే సరిపోదు. అలా కాకుండా రాత్రిపూట జీలకర్రను నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని వేడి చేసుకొని తాగాలి. జీలకర్రను ఈ విధంగా ఉపయోగించడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఈ తప్పును నివారించండి
జీలకర్ర నీరు వేడి చేస్తుంది. దీని కారణంగా ఇది శరీర ఉష్ణోగ్రతను బాగా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవి కాలంలో దీనిని తాగడం మానేయాలి. ఏప్రిల్-జూన్ మధ్య తీసుకోకపోవడమే మంచిది. అయితే ఒకవేళ తాగాలనుకుంటే.. గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం మంచిది.
ఎంత సేపు తాగాలి..
జీలకర్ర నీటిని ఎంతసేపు తాగాలి అనే విషయంలో చాలా మందిలో అయోమయం నెలకొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఎక్కువ కాలం పాటు తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే పరిమిత పరిమాణంలో తాగడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదు.
Also Read: