AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఉల్లిపాయతో డయాబెటిస్‌ అదుపులో.. పరిశోధనలలో కీలక విషయాలు..!

Diabetes: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి,..

Diabetes: ఉల్లిపాయతో డయాబెటిస్‌ అదుపులో.. పరిశోధనలలో కీలక విషయాలు..!
Subhash Goud
| Edited By: Phani CH|

Updated on: Apr 06, 2022 | 9:28 AM

Share

Diabetes: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, ఎక్కువగా ఆలోచించడం తదితర కారణాల వల్ల మానవుడు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అనే తేడా లేకుండా చాలా మందిని డయాబెటిస్‌ (Diabetes) వెంటాడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ (Onion) ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది. పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మూత్రంలో మంట తగ్గేందుకు..

కాగా, ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుందట. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Heart Tips: ఈ ఆహారాలను తీసుకోండి.. ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.. అప్పుడే మీ గుండె పదిలం..!

Oil Test: మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? చిన్న ప్రయోగంతో తెలుసుకోండి

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)