AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Side Effects: ఎక్కువ సేపు ఏసీ కింద గడుపుతున్నారా.. అయితే మీరు ఇబ్బందుల్లో పడినట్లే..

వేసవి(Summer) వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేడితో ఇబ్బంది పడుతున్నవారు ఏసీ(AC) ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు...

AC Side Effects: ఎక్కువ సేపు ఏసీ కింద గడుపుతున్నారా.. అయితే మీరు ఇబ్బందుల్లో పడినట్లే..
Ac
Srinivas Chekkilla
|

Updated on: Apr 06, 2022 | 6:30 AM

Share

వేసవి(Summer) వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేడితో ఇబ్బంది పడుతున్నవారు ఏసీ(AC) ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. ఏసీ ఉన్నవారు ఏసీ వేసుకుని కూల్‌గా ఉంటారు. అయితే ఏసీలో ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదట. ఏసీలో ఎక్కువ సేపు ఉంటే డీహైడ్రేషన్(dehydration) బారిన పడే ప్రమాదం ఉందట. తలనొప్పి, మైగ్రేన్ , కళ్లు పొడిబారడం, చర్మం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఏసీలను ఆఫీసుల్లోనే కాదు, ఇల్లు, కారులో కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు.

ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఇవి బాగానే ఉన్నా.. వీటికి బానిసలుగా మారితే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా సమస్యను ఎదుర్కొంటున్నవారికి ఏసీలో ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా ఏసీలను తరచుగా క్లీన్ చేయకపోతే మాత్రం అస్తమా, అలర్జీ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం వల్ల గొంతు, ముక్కుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే గొంతు పొడిబారుతుంది కూడా. దీంతో పాటుగా రినిటిస్ వంటి సమస్యలు కూడా రావొచ్చు.

గదుల్లో ఉండే వారితో పోల్చితే ఏసీల కింద ఉండేవారే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల తేమ ఎక్కువగా గ్రహించబడుతుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడి ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాగా ఏసీలో గంటల తరబడి ఉన్న తర్వాత ఎండలోకి వెళితే తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఏసీ ఉన్న గదిని సరిగ్గా ఉంచుకోకపోయినా మైగ్రేన్, తలనొప్పి సమస్యలు వస్తాయి.

మనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏం చేయాలన్నా ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Read Also.. Covid 4th Wave: జర జాగ్రత్త! కోవిడ్ కొత్త వైరస్‌ లక్షణాలు ఇవే! 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..