AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Salt vs Table Salt: రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇటీవల హిమాలయ రాక్ సాల్ట్ వినియోగం భారీగా పెరిగింది. ఇది సహజంగా లభించే ఉప్పు కావడంతో చాలా మంది దీన్ని ఆరోగ్యానికి మేలు చేస్తుందని వాడుతున్నారు. దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని.. కొన్ని ఖనిజాలు అందుతాయని చెబుతున్నారు. అయితే ఇది ఖరీదైనది. నిజంగా ఇది సాధారణ టేబుల్ సాల్ట్ కంటే ఆరోగ్యకరమా..? అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది.

Rock Salt vs Table Salt: రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
Rock Salt Vs Table Salt
Prashanthi V
|

Updated on: Apr 30, 2025 | 9:34 AM

Share

రాక్ సాల్ట్ అనేది సముద్రపు నీటి నుంచి సహజంగా ఏర్పడే ఉప్పు. ఇది ఖనిజ ఉప్పుల రూపంలో లభిస్తుంది. ఇందులో సోడియం క్లొరైడ్‌తో పాటు మరికొన్ని సహజమైన ఖనిజాలు కూడా ఉండొచ్చు. దీనిలో రుచి సాధారణ ఉప్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది కానీ జీర్ణక్రియకు కొంత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టేబుల్ సాల్ట్ అంటే మనం రోజూ వాడే సాధారణ ఉప్పు. దీనిలో అయోడిన్ కలిపి ఉంచడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే అయోడిన్ అవసరం. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు, గోయిటర్ వంటి వ్యాధులు రావచ్చు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి అయోడిన్ అవసరం అధికంగా ఉంటుంది.

బీపీ సమస్యలు ఉన్నవారు సాధారణ ఉప్పు వాడితే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు హిమాలయ రాక్ సాల్ట్ వాడితే మెల్లగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇందులో సోడియం పరిమితంగా ఉంటుంది. అయితే ఇది కూడా పరిమితంగా వాడాలి.

రాక్ సాల్ట్ ఖరీదు సాధారణ ఉప్పుతో పోలిస్తే ఎక్కువ. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అందరికీ సమానంగా ఉండవు. ఆరోగ్యంగా ఉన్న వారు సాధారణ టేబుల్ సాల్ట్‌ను సరైన మోతాదులో వాడితే పోషకాల లోపం రాదు. కాబట్టి ఎక్కువ ఖర్చుతో ప్రత్యేక ప్రయోజనం లభించకపోవచ్చు.

పిల్లల పెరుగుదల దశలో అయోడిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. రాక్ సాల్ట్‌లో అయోడిన్ ఉండదు కాబట్టి వారికీ సాధారణ అయోడిన్ ఉప్పుతో వంటలు చేయడం ఉత్తమం. పరిశోధనల ప్రకారం ఇది పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాక్ సాల్ట్‌, టేబుల్ సాల్ట్ రెండూ తగిన ఉపయోగాలుంటే మాత్రమే వాడాలి. బీపీ సమస్యలున్నవారు, జీర్ణక్రియలో ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల సలహాతో రాక్ సాల్ట్‌ వాడవచ్చు. మిగతావారికి సాధారణ అయోడిన్ ఉప్పే సరిపోతుంది. ట్రెండ్‌ ను కాదు.. ఆరోగ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం ఉత్తమం.