AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Nuts: జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా.? ఇందులో అసలు నిజమెంత..

డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా జీడిపప్పు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొందరు నమ్ముతారు. మోతాదుకు మించి జీడిపప్పు తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరుగుతుందంటారు...

Cashew Nuts: జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా.? ఇందులో అసలు నిజమెంత..
Cashew Nuts
Narender Vaitla
|

Updated on: Nov 26, 2022 | 8:39 PM

Share

డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా జీడిపప్పు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొందరు నమ్ముతారు. మోతాదుకు మించి జీడిపప్పు తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరుగుతుందంటారు. ఇంతకీ జీడిపప్పు తింటే నిజంగానే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా.? ఇందులో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనే దాంట్లో ఏమాత్రం నిజం లేదు. జీడిపప్పు ఖచ్చితంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది , అయితే కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని కొందరు భయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేదు.

జీడిపప్పులో లభించే పోషకాలు జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని పోషకాల నిధి అని పిలుస్తారు. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి కాళ్ల నొప్పులు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు.

జీడిపప్పు తినడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గిస్తుంది. జీడిపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అందుకే చిన్నారులకు వీటిని ఎక్కువగా ఇవ్వాలని చెబుతుంటారు. హైపర్‌టెన్సివ్ రోగులకు జీడిపప్పు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జీడిపప్పు తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడంతోపాటు ఎముకలను కూడా దృఢపరుస్తుంది. జీడిపప్పులో కాపర్, ఐరన్ ఉంటాయి, ఇవి ఎర్ర రక్త కణాల వృద్ధికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..