Health Tips: గర్భిణులకు కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు దివ్య ఔషదం..

మహిళలకు తల్లిగా మారడం ఒక అందమైన అనుభూతి. కానీ గర్భధారణ సమయంలో మహిళలు చాలా దశలను దాటవలసి ఉంటుంది. ప్రతి అలవాటును మార్చుకోవాలి. ఏం తినాలి, ఏ వైపు పడుకోవాలి, ఎంత తినాలి ఇలా..

Health Tips: గర్భిణులకు కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు దివ్య ఔషదం..
Coconut Oil
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 26, 2022 | 8:30 PM

మహిళలకు తల్లిగా మారడం ఒక అందమైన అనుభూతి. కానీ గర్భధారణ సమయంలో మహిళలు చాలా దశలను దాటవలసి ఉంటుంది. ప్రతి అలవాటును మార్చుకోవాలి. ఏం తినాలి, ఏ వైపు పడుకోవాలి, ఎంత తినాలి ఇలా అన్నీ జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.  మనకంటే లోపల ఉన్న బిడ్డ పుష్టిగా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం.  ఇదే సమయంలో గర్భిణులు పడే సమస్యలపై కొంత నిర్లక్ష్యంతో ఉంటారు. అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే వారి కష్టాలు కొంతమేరకు తగ్గుతాయి. కొబ్బరినూనె  గర్భిణుల అనేక సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు.  గర్భధారణ సమయంలో కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఆహారంలో ఉపయోగించండి

కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. దీంతో పాటు కొబ్బరి నూనె నుంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డకు వెంట్రుకలు బాగుంటాయని, గర్భిణికి కూడా జుట్టు రాలిపోయే పరిస్థితి ఎదురవదని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రెచ్ మార్క్స్

గర్భిణీల ప్రధాన ఆందోళనలలో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి. గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్‌లను తొలగించడానికి మహిళలు అనేక రకాల విధానాలను ఉపయోగిస్తారు. కానీ వారు ఆశించిన ఫలితాలను పొందలేరు. అయితే కొబ్బరి నూనె సహాయంతో మీరు చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను వదిలించుకోవచ్చు. ప్రతిరోజు పొట్టపై ​​మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను తొలగించడంలో కొబ్బరినూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆయిల్ పుల్లింగ్

దీనిని కొబ్బరి నూనెతో మౌత్ వాష్ అంటారు. గర్భధారణ సమయంలో రుచి కోల్పోతే కొబ్బరి నూనెతో పుక్కిలించడం మంచిది. ఇలా చేయడం వల్ల స్త్రీల మూడ్ బాగవుతుంది. ఇతర ఆహారాలను తినడానికి ఇష్టపడుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అలర్జీ సమస్యకు పరిష్కారం

గర్భధారణ సమయంలో దాదాపు 25 శాతం మంది మహిళల్లో అలర్జీ సమస్య ఉంటుంది. మీరు గర్భధారణకు ముందు అలెర్జీని కలిగి ఉంటే గర్భధారణ సమయంలో మీకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. శరీర దురదను తొలగించడానికి డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. అయితే శరీరానికి స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనెను రాసుకుంటే దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పరుపు, బెడ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకసారి బెడ్‌ షీట్లను వేడి నీటితో ఉతకాలి. కిటికీలు తలుపులు మూసిఉంచాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?