AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: ఆదరాబాదరగా తింటే ఆరోగ్యం ఆగమైనట్లే.. నిపుణులు చెబుతోంది ఇదే..

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే విసయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుకుల జీవితంలో ప్రశాంతంగా కూర్చొని తినే అవకాశం కూడా లేకుండా పోతోంది. తినే తిండి కూడా హడావుడిగా తింటోన్న రోజులిలివీ. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు...

Health News: ఆదరాబాదరగా తింటే ఆరోగ్యం ఆగమైనట్లే.. నిపుణులు చెబుతోంది ఇదే..
Health
Narender Vaitla
|

Updated on: Nov 26, 2022 | 8:27 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే విసయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుకుల జీవితంలో ప్రశాంతంగా కూర్చొని తినే అవకాశం కూడా లేకుండా పోతోంది. తినే తిండి కూడా హడావుడిగా తింటోన్న రోజులిలివీ. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తినడానికి సగటున 30 నుంచి 35 నిమిషాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని పూర్తిగా నమలిన తర్వాతే మింగాలని చెబుతున్నారు. ఆదరాబాదరగా తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు తప్పవని చెబుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఈ టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

భోజనాన్ని కనీసం 30 నిమిషాలు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. తీసుకునే ఆహారాన్ని బట్టి కనీసం 15 నుంచి 30 సార్లు నమలడానికి ప్రయత్నించాలి. ఇలా తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. జపాన్‌లోని ఒక విశ్వవిద్యాలయ పరిశోధకులు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 59,717 మంది నుండి డేటాను పరిశీలించారు. వేగంగా తినే వారు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ప్రధాన కారణం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకాకపోవడమే.

తొందరపడి ఆహారాన్ని తీసుకంటే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణం చేసే సమయంలో భోజనం చేయకూడదు. రాత్రి 8 గంటలు దాటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తర్వతే నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఆహారం తీసుకునే సమయంలో ఇలాంటి టిప్స్‌ పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనమేరకే నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..