Women’s Day 2022: ఈ 4 పోషకాలు మహిళలకు జీవితాంతం కావాల్సిందే.. అవి ఏమిటి.. ఏ ఆహారపదార్ధాలో లభిస్తాయంటే..
Women's Day 2022: అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఆధునిక కాలంలో మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం. ముఖ్యంగా మహిళలు ఓవైపు ఇంటికి ఇల్లాలుగా..
Women’s Day 2022: అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఆధునిక కాలంలో మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం. ముఖ్యంగా మహిళలు ఓవైపు ఇంటికి ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైవు ఆదాయం కోసం వివిధ రంగాల్లో పనులు చేస్తూ.. ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నారు. రకరకాల ఒత్తిడితో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. అనారోగ్యానికి గురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళ ఆరోగ్యాన్ని ఇచ్చే ముఖ్యమైన ఆహారం, కొన్ని డైట్ చిట్కా(Diet Tips) ను పాటించాలి. మనం తినే ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి( Good health) . మనం ఉత్తమంగా పనిచేయడానికి , మన జీవిత లక్ష్యాలను సాధించడానికి మంచి పోషణ అవసరం. మంచి ఆరోగ్యం అనేది నిరంతర ప్రక్రియ. మహిళలకు మరీ ప్రత్యేకమైన ఆహారం అవసరం. బాల్యం నుండి యుక్తవయస్సు వరకు.. మాతృత్వం, రుతు క్రమం సమయంలో మహిళ శరీర పని తీరు మారుతూ ఉంటుంది. దీంతో శరీరానికి తగిన పోషక అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. ఈరోజు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్రపోషిస్తూ జీవితాంతం అవసరమయ్యే నాలుగు ముఖ్య పోషకాల గురించి తెలుసుకుందాం..
- కేలరీలు: కేలరీలు పురుషుల కంటే మహిళలకు తక్కువ కేలరీలు అవసరం. ఎందుకంటే కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న పురుషులతో పోలిస్తే స్త్రీల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, స్త్రీలలో బేసల్ మెటబాలిక్ రేట్ (BMR) పురుషుల కంటే తక్కువగా ఉంటుంది. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వలన షరీరానికి తగినన్ని కేలరీలు అందించవచ్చు. మహిళల్లో, పురుషుల్లో ఉన్న జీవక్రియ వ్యత్యాసాల కారణంగా మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం. గర్భిణీ సమయంలో శరీర బరువుకు అదనపు కొవ్వును జోడిస్తుంది. ఎందుకంటే శిశువు గురించి కేరింగ్ తీసుకునే అమ్మ రెగ్యులర్ ఛార్జ్ మారుతుంది. వ్యాయామం , నిద్ర వంటి వాటికీ దూరంగా ఉంటుంది. కనుక గర్భధారణ తర్వాత బరువు తగ్గడం ఒక సవాలుగా అవుతుంది. అయితే తల్లి పాలివ్వడం అనేది గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనుక పుట్టిన బిడ్డకు తప్పని సరిగా పాలు ఇవ్వాలి. మెనోపాజ్ దశ కూడా పొట్టకు అదనపు కొవ్వును చేరుస్తుంది. దీంతో జీవితంలో నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సవాళ్లను అధిగమించే మార్గం ఏమిటంటే, వ్యాయామం చేస్తూ.. సరైన ఆహారాన్ని తీసుకోవడం జీవితకాలంలో రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాల్సి ఉంది.
- కేలరీలు లభించే పదార్ధాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, కూరగాయలు , పండ్లు, పాల పదార్ధాలు వంటి ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కేలరీల శరీరానికి లభించడానికి మంచి మార్గం.
- ఐరెన్: ఇది మహిళలకు జీవితకాలంలో ముఖ్యమైన ఖనిజం. వేగవంతమైన అభివృద్ధి దశ బాల్యం. దీంతో రక్తం వృద్ధి కావడానికి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఐరన్ అవసరం. యుక్తవయస్సులో.. ఋతుక్రమ సమయంలో అయ్యే రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి తగినంత మొత్తంలో ఇనుము అవసరం. గర్భిణీ స్త్రీలకు ఐరన్ కీలకమైన పోషకం. పిండం పెరుగుదలకు, ప్రసవ సమయంలో రక్తం కోల్పోవడంతో ఈ సమయంలో ఐరన్ అవసరాన్ని పెంచుతుంది. పోషకాహారం లేని ఆహారం తీసుకునే స్త్రీలు రుతుక్రమం సమయంలో రక్తహీనతకు గురవుతారు.
- తీసుకోవాల్సిన ఆహారం: పచ్చని ఆకు కూరలు, ఉసిరికాయ, కాలీఫ్లవర్ ఆకుకూరలు, ముల్లంగి ఆకులు, మాంసం, చేపలు మొదలైన ఆహారపదార్ధాలను రెగ్యులర్ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. అంతేకాదు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఐరన్-రిచ్ ఫుడ్‌తో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరెన్ పెరుగుతుంది.
- ఫోలిక్ యాసిడ్ (ఫోలేట్): యుక్తవయస్సులో వేగవంతమైన పెరుగుదల కాలంలో శరీరానికి మద్దతు ఇచ్చే DNA, RNA సంశ్లేషణకు విటమిన్ B9 తప్పనిసరి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి శారీరక కార్యకలాపాలకు ఇది అవసరం. ఈ విటమిన్ లోపం ఏర్పడితే.. రక్తహీనతకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్ లోపాన్ని ఎదుర్కొంటే.. ఎదుగుదల, పుట్టుకతో వచ్చే లోపాలు, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ వంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోలిక్ ఆమ్లం లోపం ఉంటె గుండె జబ్బుల ప్రమాదాని గురయ్యే అవకాశం కూడా ఉంది. విటమిన్ B9 లభించే పదార్ధాలు: పచ్చి ఆకు కూరలు ,ఉసిరికాయ, చుక్క కూడా, పుదీనా , బచ్చలికూర (120 , బెంగాల్ గ్రాము, నల్ల శనగలు, పచ్చి శనగలు, ఎర్ర శనగలు (120 mg/100gm), అల్లం, సోయాబీన్ వంటి నూనె గింజల్లో కూడా ఉంటుంది.
- కాల్షియం: బాల్యంలో పెరుగుదల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు.. శరీరానికి తగినంత కాల్షియం కావాల్సి ఉంది. ఇది ఆరోగ్యకరమైన ఎముక, దంతాల అభివృద్ధిని నిర్ధారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు తన శరీర రక్షణ కోసమే కాదు.. పుట్టబోయే శిశువు ఎముక ఆరోగ్యకరమైన నిర్మాణం అభివృద్ధికి కాల్షియం అవసరం. కాల్షియం స్త్రీ జీవితాంతం ముఖ్యమైనదిగా పోషకం. గుండె కండరాల సరైన నరాల పనితీరు, కండరాల ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో కాల్షియం కూడా ముఖ్య పాత్రని పోషిస్తుంది. లభించే పదార్ధాలు: తృణధాన్యాలు , చిక్కుళ్ళు, రాగులు, బెంగాల్ గ్రాము, అవిసెలు, రాజ్మా , సోయాబీన్ , ఆకుకూరలు, ఉసిరికాయ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, కరివేపాకు మొదలైనవి.
- ఇవి స్త్రీ జీవితంలో ప్రత్యేకించి ముఖ్యమైన పోషకాలు. అయినప్పటికీ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలంటే.. తప్పనిసరిగా ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం , మంచి జీవనశైలిని పాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర, వ్యాయామం, హైడ్రేషన్ అన్నీ ముఖ్యమైనవి. కనుక సమతుల్య జీవితాన్ని పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్యకరమైన స్త్రీ.. ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన దేశంగా మారుస్తుంది.
Also Read: