Lemon: నిమ్మకాయతో, నిమ్మ తొక్కతో లెక్కబెట్టలేనన్ని ప్రయోజనాలు
మాంసాహారం తినే సమయంలో.. మటన్, చికెన్ లాంటి వంటకాల్లో నిమ్మకాయను పిండటం చాలామందికి అలవాటు. ఉల్లిపాయలు, మిర్చి బజ్జిల మీద కూడా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు చాలామంది. ఇలా నిమ్మకాయను పిండుకోవడం వల్ల చలువ చేస్తుంది. దానికి తోడు నిమ్మకాయలో కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి.

నిమ్మకాయ నిత్యం మన ఆహారంలో ఎదో ఒక రకంగా భాగంగానే ఉంటుంది. టీ రూపంలోనో, పచ్చడి రూపంలోనో, జ్యుస్ రూపంలోనో ఆఖరికి పులిహోర మాదిరిగానో.. మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. సాధారణంగా నిమ్మకాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మాములుగా జలుబు, దగ్గు రాగానే పులుపు తినొద్దు అంటూ నిమ్మకాయ లాంటి సి విటమిన్ ఉన్న పండ్లను దూరం పెడుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు వైద్యులు. సి విటమిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుందన్నది వైద్యుల మాట.
మాంసాహారం తినే సమయంలో.. మటన్, చికెన్ లాంటి వంటకాల్లో నిమ్మకాయను పిండటం చాలామందికి అలవాటు. ఉల్లిపాయలు, మిర్చి బజ్జిల మీద కూడా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు చాలామంది. ఇలా నిమ్మకాయను పిండుకోవడం వల్ల చలువ చేస్తుంది. దానికి తోడు నిమ్మకాయలో కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. కేవలం నిమ్మరసమే కాదు.. నిమ్మ తొక్క వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. నిమ్మ తొక్కలను పొడి రూపంలో చేసి చర్మం, జుట్టుకు అప్లై చేసుకోవచ్చట . నిమ్మ తొక్కల్ని ఎండ బెట్టి పొడి చేసి.. గాలి తాకకుండా సీసాల్లో పెట్టాలి. ఈ పొడిని కూరల్లో, పచ్చళ్లలో జ్యుస్‌లలో కలుపు కుంటే సి విటమిన్ కొరత రాకుండా ఉంటుంది. ఇక నిమ్మకాయ తొక్కలను శరీరంపై రుద్దిదే మురికి పోవడమే కాకుండా చర్మ సంబంధిత వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి. కాస్మొటిక్ సబ్బుల తయారీలో కూడా నిమ్మకాయ తొక్కలను వాడతారు.
ఇక నిమ్మకాయతో రక్త పోటు కూడా దారిలోకి వస్తుందని అంటున్నారు వైద్యులు. నిమ్మ రసంతో పాటు నిమ్మ చెక్కల పొడి శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడటంతో పాటు గుండె జబ్బులను కూడా కంట్రోల్‌లో పెడుతుందట. వీటితో పాటు ఎముకలను ధృడంగా మారతాయట. శరీరంపై వచ్చే గడ్డలు, కాయలు వంటి వాటిని తొలగించడంలో నిమ్మ తొక్కల పొడి చాల ఉపయోగపడుతుందట. మరీ ముఖ్యంగా జర్నీ చెయ్యాలి అంటే చాలామంది వాంతులు అవుతాయని భయపడతారు. అలాంటి సమయాల్లో నిమ్మకాయలు వెంటబెట్టుకొని తరచుగ వాసన పీల్చుతూ ఉంటే.. ప్రయాణం సాఫీగా సాగుతుంది. చూశారా.. నిమ్మకాయలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇంకే విరివిగా మీరూ వాడేయ్యండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..