Menstruation Diet: నెలసరి టైంకి రావడం లేదా..? ఆరోగ్యకరమైన పీరియడ్స్ కోసం మీ డైట్లో వీటిని చేర్చండి..!!
నెలసరి సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్స్ ప్రభావం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి.

Food For Health Periods: నెలసరి సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్స్ ప్రభావం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి కండరాలు పట్టేస్తాయి. తలనొప్పి, కడుపునొప్పి, కడుపులో ఉబ్బరం, అలసట, చిరాకు, విచారం, కోపం, డిప్రేషన్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నెలసరి సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పీరియడ్స్ సమయంలో మహిళలు పోషకాలు, ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తుంటారు.
అయితే కొంతమంది పీరియడ్స్ సరిగ్గా రావు. ప్రతి 28రోజులకు ఒకసారి వచ్చే బుుుతుక్రమం నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. అయితే కొందరిలో పీరియడ్స్ సమయానికి రావు. 35రోజులకు ఒకసారి..ఇంకొందరిలో ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి వస్తుంటాయి. అలాంటి వారు వారు తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేయాల్సిందే. ఆరోగ్యకరమైన పీరియడ్స్ ను ట్రాక్ లోకి తీసుకురావడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. బొప్పాయి:
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కెరోటిన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిని సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుది. బొప్పాయిలో ఉండే పోషకాలను నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రానివారికి బొప్పాయి తినమని వైద్యులు చెబుతుంటారు.




2. క్యారమ్ సీడ్స్:
ఈ క్యారమ్ సీడ్స్ నెలసరి చక్రం సరిగ్గా ఉండేలా నియంత్రిస్తుది. జీర్ణక్రియకు కూడా సహాకరిస్తుంది. క్యారమ్ గింజలను నీటిలో మరిగించి పీరియడ్స్ సమయంలో తాగినట్లయితే…పొత్తు కడుపులో వచ్చే నొప్పిని నివారిస్తుంది.
3. అలొవెరా:
అలొవెరాను ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇది క్రమరహిత బుుతు చక్రం కోసం ప్రకృతి అందించే గొప్పఔషధం. ఇందులో ఫోలిక్ యాసిడ్,అమైనో ఆమ్లాలు, సాలిసిలిక్ ఆమ్లం, విటమిన్లు ఏ,సి, ఈ, బి12 పుష్కలంగా ఉన్నాయి. పీరియడ్స్ కు కారణమయ్యే హార్మోన్లను ఇది కంట్రోల్ చేస్తుంది. ప్రతినెలా సమయానికి రుతుక్రమం వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది.
4. దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఇన్సులిన్ స్థాయిలు, హార్మోన్లు బుుతుచక్రంపై ప్రభావం చూపుతాయి. దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకున్నట్లయితే శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది గ్లూకోజ్, ఇన్సులిన్ ను ప్రాసెస్ చేసే శరీర సామర్థాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యను తగ్గించడంలోనూ చక్కగా సహాయపడుతుంది.
5. పైనాపిల్:
పైనాపిల్‌లో “బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు క్రమరహిత రుతుక్రమంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది మీ పీరియడ్స్ ప్రీపోన్ చేసేందుకు కూడా సహాయపడుతుంది.
6. ఫెన్నెల్ సీడ్స్:
ఇవి క్రమరహిత పీరియడ్స్ ను అరికట్టడంలో చక్కగా ఉపయోగపడతాయి. హర్మోన్లను సమతుల్యం చేయడంలోనూ సహాయపడుతుంది. అంతేకాదు అండోత్సర్గాన్ని ప్రోత్సహిస్తుంది. పీరియడ్స్ లో వచ్చే తిమ్మిరిని తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి