Health Tips: ఆహారప్రియులకు అలర్ట్.. నూనె, మసాలా ఫుడ్ బాగా తింటున్నారా ? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

Health Tips: ఆహారప్రియులకు అలర్ట్.. నూనె, మసాలా ఫుడ్ బాగా తింటున్నారా ? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Spicy Food

సాధారణంగా చాలా మంది స్పైసీ ఫుడ్ అంటే తెగ ఇష్టపడతారు. ఎక్కువగా నూనె ఉండి.. మసాలా ఉన్న ఆహారాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Rajitha Chanti

|

Apr 12, 2022 | 9:49 AM

సాధారణంగా చాలా మంది స్పైసీ ఫుడ్ అంటే తెగ ఇష్టపడతారు. ఎక్కువగా నూనె ఉండి.. మసాలా ఉన్న ఆహారాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కొందరికి కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే నూనె, ఎక్కువగా కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దని సూచిస్తుంటారు నిపుణులు. ఇలాంటి ఆహారాన్ని మితంగా తీసుకోవాలని.. దాదాపు మానివేయడానికి ప్రయత్నించాలంటూ వైద్యులు అంటుంటారు.  (Healthy Tips)కానీ మసాలా, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తినకుండా ఉండలేరు ఎక్కువ మంది. కానీ స్పైసీ ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. కడుపులో ఎలాంటి సమస్యలు ఉండవు. అవెంటో తెలుసుకుందామా.

* ఏ కాలంలోనైనా ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వేడి నీటిని తాగాలి. కడుపు సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వేడి నీటిని తాగడం మంచిది. తరచూ ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు వేడి నీటిని తాగడం మంచిది. * నడక ద్వారా అనేక వ్యాధులను తగ్గించవచ్చు. నూనెతో ఉన్న ఆహారాన్ని తిన్నా లేదా బరువుగా ఉన్నా, నడవడం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు శరీరంలోని ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆహారం తిన్న తర్వాత కనీసం 100 అడుగులు నడవడం చాలా ముఖ్యం. * నల్ల మిరియాలు, ఆకుకూరల గురించి మనందరికీ తెలుసు. హెవీ ఫుడ్ లేదా చాలా ఆయిల్ ఫుడ్ తిన్నట్లయితే చింత అవసరం లేదు. ఎండుమిర్చి, వాము పొడిని మిక్స్ చేసి వేడినీటితో సేవించాలి. ఎండుమిర్చి, వాము గింజలను తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు ఎండుమిర్చి, వాము గింజలను రోజూ తీసుకుంటే జీర్ణశక్తి బలపడుతుంది. * అజ్వైన్, బ్లాక్ సాల్ట్ కడుపు సమస్యలను దూరం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఒక పాత్రలో ఆకుకూరలను తీసుకుని, నల్ల ఉప్పును నీటితో కలిపి బాగా మరిగించాలి. ఆ తర్వాత నిదానంగా తాగాలి. ఈ నీటితో నూనె పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి.

గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనల ప్రకారం.. ఇతర వెబ్ సైట్స్ ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. ఈ పద్దతులను అనుసరించడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: Vivek Angihotri: మరో రెండు కథలతో రాబోతున్న ది కశ్మీర్ పైల్స్ డైరెక్టర్.. అభిషేక్ అగర్వాల్ కాంబోలో..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu