Periods‌: పీరియడ్స్‌ సమయంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్లు.. ఊరగాయను ముట్టుకోకపోవడం నుంచి వంట గది వరకు..

Periods‌: పీరియడ్స్‌ సమయంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్లు.. ఊరగాయను ముట్టుకోకపోవడం నుంచి వంట గది వరకు..

Periods‌: ఆడవారి శరీరానికి తప్పని ఇబ్బంది పిరియడ్స్. నిజానికి స్త్రీకి పిరియడ్స్ అవసరమైన ఏమైనా ఇష్టంగా స్వీకరించలేదు. ఈ సమయంలో..

Subhash Goud

|

Apr 12, 2022 | 10:43 AM

Periods‌: ఆడవారి శరీరానికి తప్పని ఇబ్బంది పిరియడ్స్. నిజానికి స్త్రీకి పిరియడ్స్ అవసరమైన ఏమైనా ఇష్టంగా స్వీకరించలేదు. ఈ సమయంలో ప్రతి స్త్రీ (woman)కి అసౌకర్యంగా ఉంటుంది. కానీ శరీర నిర్మాణం ప్రకారం ఇది తప్పదు. చాలా మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో మలబద్ధకం, మోషన్స్, కడుపు ఉబ్బరం లేదా కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, అలసట లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలు వేరైనా వీటి వెనుక ఉండే కారణం ఒకటే అయి ఉండవచ్చు. పీరియడ్స్ సమయంలో ఇంటిలోని పూజ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళవద్దని ఇంట్లో సూచిస్తుంటారు. బహిష్టు అనేది ఎక్కువగా బాధించే విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం.. ఈ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు. ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోవడం నుంచి వంటగదిలోకి వెళ్లడం వరకు నియమాలు పాటించాలి. వంటగదిలోకి వెళ్ళకూడదు. ఇక క్లుప్తంగా చెప్పాలంటే ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాల్సి ఉంటుంది.

వాస్తవానికి పాత కాలం రోజుల్లో బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతో ఉంటుంది. ఎవరు మాట్లాడకుండా ఉండేవారు. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. అలాగే తులసి మొక్కను తాకకూడదు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని, పూజ చేయటం వరకు దూరంగా ఉంటారు. బహిష్టు సమయంలో మహిళలను అపవిత్రంగా భావిస్తారు.

దీనిపై ఓ సర్వే నిర్వహించారు. 1000 మందికిపైగా స్త్రీలపై సర్వే నిర్వహించారు. ఇందులో 33 శాతం స్త్రీలు తమ మొదటి పిరియడ్స్ అనుభావాన్ని తెలియజేశారు. 35 శాతం మంది మహిళలు పీరియడ్స్‌ గురించి పెద్దగా తెలియదన్నారు. 47.4 శాతం మంది స్త్రీలు మొదటి రుతుక్రమం సమయంలో తీవ్రమైన కడుపు నొప్పిని అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే 28 శాతం స్త్రీలు పీరియడ్స్‌ వల్ల ఒక గదికే పరిమితం అయ్యామని చెప్పారు. 32.6 శాతం మంది మహిళలు తమకు రుతుక్రమం అని అంగీకరించకుండా ఉండడానికి వేరే కారణాలు చెప్పుకొచ్చారని సర్వేలో వెల్లడైంది. పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఒంటరిగా ఉండాలని మరి కొందరు తెలియజేసినట్లు సర్వే తెలిపింది.

కాలంలో మార్పులు..

ప్రస్తుతం ఒక నాగరిక ప్రపంచంలో బహిష్టు ఆంక్షలు నెమ్మదిగా కనుమరుగు అవుతున్నాయి. ఉదాహరణకు ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లో ఉండడానికి, మిగిలిన ప్రపంచం నుండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అయితే ఇప్పటికి మహిళలకు ఆ సమయంలో దేవాలయాల సందర్శన, పూజ నిర్వహించడానికి అనుమతి లేదు. సామాజిక ఒంటరితనం, అవమానాలు చాలా వరకు తగ్గాయి. పీరియడ్స్‌ సమయంలో ఊరగాయలను ముట్టుకోకపోవడం, తులసి చెట్టును తాకకపోవడం, అలాగే దేవాలయాలకు వెళ్లకుండా ఇతర చిన్నపాటి నియమాలు పాటిస్తున్నారు తప్ప.. ఎవరి పనులు వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే పాతకాలపు రోజులు ఇప్పుడు లేవు. చాలా మంది స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక స్త్రీ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. పాతకాలపురోజుల లాగే పీరియడ్స్‌ సమయంలో ఒకే గదికే పరిమితం అయ్యే రోజులు కావివి. ఉద్యోగం చేసే స్త్రీలకు అన్ని రోజులు సెలవులు దొరికి అవకాశాలు లేవురు. అలాగే వ్యాపారాలు, ఇతర పనులు చేసుకునే వారు కూడా పనులు మానేసి ఉండలేని పరిస్థితి ఉంది. కొన్ని కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ పనులు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Mobile Radiation: మొబైల్‌ రేడియేషన్‌ అంటే ఏమిటి..? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Be Careful: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. యాప్స్‌ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా..? ప్రమాదంలో పడినట్లే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu