Mobile Radiation: మొబైల్‌ రేడియేషన్‌ అంటే ఏమిటి..? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Mobile Radiation: మొబైల్‌ రేడియేషన్‌ అంటే ఏమిటి..? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Mobile Radiation

Mobile Radiation: ఈ రోజుల్లో మొబైల్‌ వాడటం ఎక్కువైపోయింది. మొబైల్‌ (Mobile) లేని వారంటూ ఉండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే..

Subhash Goud

|

Apr 12, 2022 | 9:59 AM

Mobile Radiation: ఈ రోజుల్లో మొబైల్‌ వాడటం ఎక్కువైపోయింది. మొబైల్‌ (Mobile) లేని వారంటూ ఉండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఫోన్‌లతోనే మునిగిపోతున్నారు. చాటింగ్‌లు, మేసేజ్‌లు, కాలింగ్స్‌, ఇలా రకరకాలుగా ఉపయోగిస్తూ నిత్యం మొబైళ్లతోనే కుస్తీ పడుతుంటారు. అయితే మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ప్రమాదం ఉంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. పిల్లలకైతే ఆన్ లైన్ తరగతులు ఇలా ప్రతి అవసరానికి సెల్‌ఫోన్ చాలా అవసరం.‘సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి మొబైల్స్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ (Radiation) మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన జవాబులు మాత్రం లేవు. సెల్‌ఫోన్‌ ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని, ప్యాంట్‌ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిమీద జరిగిన ప్రయోగాలు మాత్రం పరస్పర విరుద్ధ ఫలితాలనే వెలువరిస్తున్నాయి.

అయితే మొబైల్స్ వల్ల హానికలిగించే రేడియషన్ ముప్పు కొంత పొంచి ఉంటుంది. సెల్ నుంచి వచ్చే రేడియోషన్ పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. కానీ దానిని తగ్గించుకోవచ్చు. రేడియేషన్‌ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కళ్లకు హాని కలుగడమే కాకుండా చర్మం రంగు మారుతుంది. కంటి రెటీనాలను బలహీనపరుస్తుంది. రేడియేషన్ ఎలా తగ్గించాలో తెలుసుకుందాం.

 ‘రేడియేష‌న్ ’ అంటే ఏమిటి?

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేష‌న్. కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ఆ స్థాయిలో లేదన్నది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే, ఫోన్‌ రేడియేషన్‌ ఉంటున్నదని వారి వాదన. ఈ వివాదం తేలనంత వరకూ, వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు. స్పీకర్ ఫోన్‌లో మాట్లాడటం, ఫోన్‌ నిరంతరం జేబులో కాకుండా పక్కన ఉంచుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టడం లాంటి జాగ్రత్తలు పాటించమంటున్నారు విశ్లేషకులు. మొక్కలు, పక్షుల మీద సెల్‌ఫోన్‌ టవర్ల రేడియేషన్‌ ప్రభావం ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్‌టవర్లు అయోమయానికి గురి చేస్తాయనీ, వీటి నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ వాటి గుడ్లను నాశనం చేస్తాయనీ వారంటున్నారు. ఈ విషయాల గురించి కూడా కచ్చితమైన సమాచారం లేదు. అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. రేడియేషన్‌ కారణంగా చర్మంపై దురద కలిగిస్తుంది. చర్మం పొడిబారడం, ఎరుపు, ముదురు రంగులోకి మారడం జరుగుతుంది.

వృద్ధాప్యం: నిత్యం ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల హాని కలుగుతుంది. రేడియేషన్‌ కారణంగా చర్మంపై టానింగ్‌ బెడ్‌లను సృష్టిస్తాయి. కణజాలాల లొపలి పొరకు హాని కలిగిస్తుంది. రేడిషన్‌ కారణంగా వృద్ధాప్యం త్వరగా రావడమే కాకుండా దుష్ప్రభావాలకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

చర్మ సున్నితత్వం: మన వయసులో, చర్మ సున్నితత్వం అనేది ఎంతో ముఖ్యం. చర్మాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విధంగా, శాశ్వతంగా నష్టాన్ని కలిగిస్తుంది. రేడియేషన్ కారణంగా చర్మ సున్నితత్వం అనేది కోల్పోతుంది. రేడియేషన్‌ తో చర్మం ఎర్రబడటం, పొడిబారుతుండటం జరుగుతుంది. అయితే చర్మం గాలిలో ఉండే హానికరమైన కణాలకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

USకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 సర్వే ప్రకారం..

☛ రేడియేషన్‌ కారణంగా ముఖంపై మచ్చలు,  కళ్ల చుట్టూ వలయాలుగా మారే అవకాశం ఉంది.

☛ రేడియేషన్ ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుంది.

☛ ఫోన్‌లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.

☛ రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి.

☛ మీరు అలారం ఆ ఫోన్ తల దగ్గర పెట్టి నిద్రించకుడదు. అలా చేయడం వల్ల ఎక్కవ స్థాయిలో రేడియేషన్ మీ దగ్గర ఉంటుంది.

☛  ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్నా సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.

☛  యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యధికంగా తరంగాలను విడుదల చేస్తుంది.

☛ ఫోన్ జేబులో లేదా పౌచ్ లో ఎప్పుడు మీ తోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్ని తగ్గించండి. ఫోన్ ఎల్లప్పుడు మీతో ఉంటే మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది.

☛ రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ మీకు కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేలా చూసుకోండి.

☛ రేడియేషన్పీ పూర్తిగా కంట్రోల్ చేయకపోయినా.. చాల వరకు తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి:

Dangerous Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 10 యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి

Whatsapp: మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu