Infinix Hot 11 2022: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. బడ్జెట్‌ తక్కువ, ఫీచర్లు ఎక్కువ..

Infinix Hot 11 2022: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ లాంచ్‌ చేస్తోంది. ఇన్‌ఫిక్స్‌ హాట్‌ 11 2022 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు...

Narender Vaitla

|

Updated on: Apr 12, 2022 | 4:44 PM

చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థలు రోజుకో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. Hot 11 2022 పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేయనున్నారు.

1 / 5
ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానెల్‌ను అందించారు. 89.5% బాడీ - స్క్రీన్‌ రేషియోతో డిస్‌ప్లేను రూపొందించారు.

2 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఎహెచ్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఇవ్వనున్నారు. టైప్‌సీ యూఎస్‌బీ అందించారు.

3 / 5
 కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇదిలా ఉంటే ఇన్‌ఫినిక్స్‌ ఈ ఫోన్‌ ధర గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రూ. 10,000 లోపు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ధర, ఇతర ఫీచర్ల విషయమై ఇంకా పూర్తి క్లారిటీ రావాలంటే ఏప్రిల్‌ 15వరకు వేచి చూడాలి.

5 / 5
Follow us