Covaxin Vaccine: కోవాక్సిన్ మొదటి టీకా తీసుకున్నాక రెండవ డోసు తీసుకోవడానికి ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

Covaxin Vaccine: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం వ్యాక్సిన్ పంపిణీని పై దృష్టి సారించింది. అయితే వ్యాక్సిన్ పై

Covaxin Vaccine: కోవాక్సిన్ మొదటి టీకా తీసుకున్నాక రెండవ డోసు తీసుకోవడానికి ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?
Covaxin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2021 | 11:16 AM

Covaxin Vaccine: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం వ్యాక్సిన్ పంపిణీని పై దృష్టి సారించింది. అయితే వ్యాక్సిన్ పై చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. అలాగే మొదటి డోసు వేసుకున్నాక రెండవ టీకా ఎప్పుడూ వేసుకోవాలనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే మే మొదటి వారంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా డ్రైవ్ స్టార్ట్ చేసింది కేంద్రం. అందులో చాలా వరకు కోవాక్సిన్ టీకా ఉపయోగించారు. ప్రస్తుతం వారు రెండవ టీకా తీసుకోవాల్సింది. కోవాక్సిన్ టీకా వేసుకున్నాక రెండవ టీకా ఎప్పుడు వేసుకోవాలి ? ఆలస్యం జరిగితే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కోవాక్సిన్.. కేవలం మొదటి డోసు మాత్రమే కాకుండా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్నవారి శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా పెంపోందిస్తుంది. మరింత రోగ నిరోధక శక్తి పెంపోందేందుకు రెండవ టీకా కచ్చింతంగా తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత 14 రోజుల వరకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిషీల్డ్ టీకా మాదిరిగా కాకుండా.. రెండు డోసుల మధ్య 12- 16 వారాల సమయం ఉండడానికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవాక్సిన్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కనీసం 6 వారాల సమయం ఉండాలి. ఇటీవల జరిగిన అధ్యయనంలో కోవాక్సిన్ తీసుకున్నవారిలో కంటే.. కోవిషీల్డ్ తీసుకున్నవారిలో ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మొదటి టీకా తీసుకున్న తర్వాత నిర్ణయించిన సమయంలో రెండవ డోసు తీసుకోకపోతే.. మొదటి టీకా ప్రభావం పనికి రాదని.. మళ్లీ మొదటి నుంచి వేయించుకోవాలనే సందేహాలలో నిజం లేదు. రెండవ టీకా తీసుకోవడం వలన మీరు పూర్తి కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లే.

మొదటి టీకా తీసుకున్న తర్వాత కరోనా బారిన పడితే.. వార దాదాపు 2 నుంచి 3 నెలల వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే.. కోవిడ్ చికిత్సలో ఉపయోగించిన మందుల వలన వారిలో రోగ నిరోధక శక్తి కొంత కాలం వరకు ఉంటుంది. కానీ మొదటి టీకా తీసుకున్న వారు రెండవ టీకా తీసుకోవడం వలన పూర్తి రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకోవడమే కాకుండా.. కరోనా నుంచి కాపాడుకోగలరు.

Also Read: India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!

Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చల్లించిపోయిన రియల్ హీరో…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!