క్యాన్డ్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ ఏది ఆరోగ్యానికి మంచిది.. ICMR హెచ్చరిక ఏమిటంటే

ICMR వెల్లడించిన ఈ సమాచారంతో క్యాన్డ్ జ్యూస్ తాగడం ఎందుకు ప్రమాదకరం? క్యాన్డ్ జ్యూస్ బదులుగా తాజా పండ్ల రసాన్ని ఎందుకు తాగాలి అనే ప్రశ్నలు చాలా మంది మనస్సులలో తలెత్తుతున్నాయి. క్యాన్డ్ జ్యూస్ ఒక రకమైన ఖరీదైన విషం అంటున్నారు హెల్త్ పాలసీ నిపుణుడు డాక్టర్ అన్షుమన్ కుమార్. ఇది అనేక విధాలుగా శరీరానికి ప్రమాదకరం. ఈ విషయంలో నిపుణులు చెప్పిన సమాచారం గురించి తెలుసుకుందాం..

క్యాన్డ్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ ఏది ఆరోగ్యానికి మంచిది.. ICMR హెచ్చరిక ఏమిటంటే
Packaged Fruit JuiceImage Credit source: Westend61/Westend61/Getty mages
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2024 | 5:19 PM

కూరగాయలు, పండ్లతో చేసిన రకరకాల జ్యూస్ లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్మకం. అయితే ఇంట్లో ఈ జ్యూస్ లు తయారు చేసుకుని తాగే సమయం లేకపోతే బయట జ్యూస్ కార్నర్‌లో తాగుతారు. మరికొందరు మార్కెట్ లో దొరికే ప్యాక్ చేసిన జ్యూస్ ని తాగడానికి ఇష్టపడతారు. శీతల పానీయాల కంటే క్యాన్డ్ జ్యూస్ ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఈ క్యాన్డ్ జ్యూస్ ల గురించి రోజు రోజుకీ రకరకాలుగా పబ్లిసిటీ చేస్తున్నారు. దీంతో ఈ జ్యూస్‌ని చూసి జనాలు తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా యువత, పిల్లలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ప్యాకెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది కాదని ICMR తెలిపింది.

ప్యాక్ చేసిన జ్యూస్‌లలో ఫ్రూట్ జ్యూస్ ఉండదని ICMR తెలిపింది. అనేక రకాల కృత్రిమ రుచులు ఇందులో మిళితమై ఉంటాయి. అంతేకాదు ఈ క్యాన్డ్ జ్యూస్ లో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. కనుక క్యాన్డ్ జ్యూస్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ICMR వెల్లడించిన ఈ సమాచారంతో క్యాన్డ్ జ్యూస్ తాగడం ఎందుకు ప్రమాదకరం? క్యాన్డ్ జ్యూస్ బదులుగా తాజా పండ్ల రసాన్ని ఎందుకు తాగాలి అనే ప్రశ్నలు చాలా మంది మనస్సులలో తలెత్తుతున్నాయి. ఈ విషయంలో నిపుణులు చెప్పిన సమాచారం గురించి తెలుసుకుందాం..

ఏ జ్యూస్ ప్రయోజనకరం అంటే

క్యాన్డ్ జ్యూస్ ఒక రకమైన ఖరీదైన విషం అంటున్నారు హెల్త్ పాలసీ నిపుణుడు డాక్టర్ అన్షుమన్ కుమార్. ఇది అనేక విధాలుగా శరీరానికి ప్రమాదకరం. క్యాన్డ్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఫ్రక్టోజ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బులు, చిత్తవైకల్యం, క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

క్యాన్డ్ జ్యూస్ మాత్రమే కాదు సాధారణ పండ్ల రసం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్ అన్షుమాన్ వివరిస్తున్నారు. ఎందుకంటే పండ్ల రసాన్ని తయారు చేసినప్పుడు.. పండ్లలోని ఫైబర్ తొలగించబడుతుంది. ఫ్రక్టోజ్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొవ్వు కాలేయాన్ని కలిగిస్తుంది. ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ కూడా అకస్మాత్తుగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో పండ్ల రసాన్ని కూడా పరిమిత పరిమాణంలో త్రాగాలి.

పండ్ల రసానికి బదులుగా పండ్లు తినండి

పండ్లు లేదా కూరగాయల జ్యూస్ తాగడం కంటే పండ్లు తినడం వల్ల మేలు జరుగుతుందని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి అంటున్నారు. చక్కెర స్థాయిని వేగంగా పెంచే కొన్ని జ్యూస్ లు ఉన్నాయి. అరటిపండు, మామిడికాయ రసం వంటివి డయాబెటిక్ రోగులకు మంచివి కాదు.

అదేవిధంగా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే ఆరెంజ్ మాత్రమే తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉండదు. ఆరెంజ్ తినడం వల్ల శరీరానికి పీచు లభిస్తుంది. కడుపు ఆరోగ్యానికి మంచిది. అయితే ఆరెంజ్ పండ్లతో జ్యూస్ తయారు చేస్తే.. దానిలోని ఫైబర్ మొత్తం తొలగిపోతుంది. ఫైబర్ లేని ఆరెంజ్ జ్యూస్ తాగడం వలన ప్రేగుల పనితీరు పాడు అవుతుంది.

ప్యాకెట్ ఫుడ్ కూడా ప్రమాదకరమే

క్యాన్డ్ జ్యూస్ మాత్రమే కాదు.. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి అనేక రకాల హాని కలిగిస్తాయని ICMR తెలిపింది. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ని కూడా తినకూడదు.

ప్యాకేజ్డ్ ఫుడ్స్ విషయానికి సంబంధించి డాక్టర్ అన్షుమాన్ మాట్లాడుతూ.. ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ప్రోటీన్ లేదా విటమిన్ లేదా మినరల్‌లు ఏవీ ఉండవని.. అయితే ఇందులో చక్కెర, కొవ్వు, ఉప్పు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి మధుమేహం, గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఈ రకమైన ఆహారం తినేవారిలో సాధారణ వ్యక్తితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుంది. ప్యాక్ చేసిన ఆహారం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్స్ అస్సలు తినవద్దని సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు