Air Pollution: ప్రమాదం అంచులో మానవాళి.. వాయు కాలుష్యంతో 40 ఏళ్లల్లో కోట్లాది మంది మరణం..

సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరో సంచలన విషయం వెల్లడించింది. వాయుకాలుష్యం ప్రస్తావన రాగానే సహజంగానే పీఎం 2.5 అంశం గుర్తుకు వస్తుంది. ఈ అధ్యయనంలో కూడా ఈ అంశం ప్రస్తావించబడింది. నివేదిక ప్రకారం PM 2.5 అంటే విషపూరితమైన గాలితో పాటు చిన్న కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని వెల్లడించింది.

Air Pollution: ప్రమాదం అంచులో మానవాళి.. వాయు కాలుష్యంతో 40 ఏళ్లల్లో కోట్లాది మంది మరణం..
Air Pollution
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2024 | 4:36 PM

రోజు రోజుకీ మానవాళి ప్రమాదంలో పడుతోంది. మానవసరాల కోసం తరుగుతున్న అడవులు, పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే వ్యర్ధలతో పెరుగుతున్న వాయు కాలుష్యంతో జనజీవనం అస్తవ్యస్తం కానుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం 1980 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం 13.5 కోట్ల మంది వాయు కాలుష్యం కారణంగా మరణించారు. నివేదిక ప్రకారం రానున్న 40 ఏళ్లలో కర్బన ఉద్గారాలు, అడవుల్లో మంటలు వంటి సంఘటనలుతో భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను పోగొట్టుకోనున్నారు.

సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరో సంచలన విషయం వెల్లడించింది. ఎల్ నినో, ఇతర వాతావరణ సంబంధిత కారకాలు కూడా వాయు కాలుష్య ప్రభావాలను మరింత ప్రమాదకరంగా మార్చాయని పరిశోధకులు భావిస్తున్నారు.

వాయుకాలుష్యం ప్రస్తావన రాగానే సహజంగానే పీఎం 2.5 అంశం గుర్తుకు వస్తుంది. ఈ అధ్యయనంలో కూడా ఈ అంశం ప్రస్తావించబడింది. నివేదిక ప్రకారం PM 2.5 అంటే విషపూరితమైన గాలితో పాటు చిన్న కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

నయం చేయలేని రోగాల బారిన పడుతున్న ప్రజలు

వాయుకాలుష్యం కారణంగా అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాలుష్యం వల్ల కలిగే అసలైన సమస్య ఏమిటంటే.. కాలుష్య కోరల్లో చిక్కుకున్న వ్యక్తుల ఆయుర్దాయం తగ్గుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో వాయుకాలుష్యంతో గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులు మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాయు కాలుష్యం దుష్ప్రభావాల కారణంగా కొన్ని వ్యాధులు చికిత్స తీసుకున్నా నయం కావు అంటూ హెచ్చరిస్తున్నారు.

దారుణ స్థితిలో ఆసియా దేశాలు

సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, PM 2.5 కారణంగా అత్యధిక మరణాలు ఆసియాలో సంభవించాయి. ఆసియాలో దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కూడా అత్యధిక మరణాలు చైనా, భారతదేశంలోనే సంభవించాయి.

భారతదేశం, చైనాతో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్ దేశాల్లోని ప్రజల అకాల మరణాలు భారీ ఎత్తున సంభవించాయి. ఈ దేశాల్లో మరణించిన వారి సంఖ్య 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఈ అధ్యయనంలో అత్యంత సూక్ష్మమైన, ముఖ్యమైన విషయం ఏమిటంటే వాతావరణంలో మార్పులు విషపూరిత గాలి కారణంగా మరణాల సంఖ్య 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు