- Telugu News Photo Gallery Poha (Flattened Rice) Side Effects: Should Avoid For These Health Problems
Poha Side Effects: రోజూ అటుకులతో చేసిన ఆహారాన్ని తింటున్నారా..! ఈ వ్యాధులున్నవారు తస్మాత్ జాగ్రత్త..
తెలుగు వారు అటుకులు అని ఉత్తరాది వారు పోహా అని పిలుస్తారు. భారతీయులు తినే ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి అటుకులు. వీటిని టిఫిన్ గా , స్నాక్ గా రకరకాలుగా తీసుకుంటారు. వీటితో చేసే వంట చాలా ఈజీ.. రైస్ కంటే అటుకుల్లో పోషకాలు మెండు.. అల్పాహారంగా తినే ఆహారపదార్ధాల్లో పోహా ఒకటి. ఇది చాలా త్వరగా వండవచ్చు. తేలికైన ఆహారం కావడంతో సులభంగా జీర్ణమవుతుంది. ఐరన్ లోపం ఉన్నవారు పోహాను తినడం చాలా మంచిది. అయితే పోహా వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
Updated on: Jun 11, 2024 | 3:37 PM

చాలా మందికి అన్నం బదులు ఇతర ఆహారపదార్థాలు తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా టిఫిన్ గా అటుకులతో చేసిన ఉప్మాని .. స్నాక్స్ గా పోహాతో చేసిన మిక్చర్ ని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. వేయించిన పోహా ప్రజాదరణ పొందింది. తింటే ఎంత రుచిగా ఉంటుంది. అంతేకాదు కడుపు నిండుగా ఉంటుంది

అటుకుల్లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నీటిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది. అయితే శరీరంలో అధిక ఫైబర్ ఉండకూడదు. కడుపు సమస్యలు రావచ్చు. కనుక ఈజీగా తయారు చేసుకునే ఆహారం అంటూ ప్రతిరోజూ పోహాను తినవద్దు.

అటుకులు అనేవి ప్రాథమికంగా బియ్యంతో చేసినవి. ఫలితంగా ఇవి ఎక్కువ మొత్తంలో తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అటుకులకు దూరంగా ఉండాలి

అటుకుల మిక్చర్ ను సాధారణంగా నూనెలో వేయించి తయారుచేస్తారు. ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. కనుక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అటుకుల మిక్చర్ కు దూరంగా ఉండండి

చాలామంది అటుకుల ఉప్మాకు రుచిని అందించడానికి కొంచెం ఎక్కువ ఉప్పు వేస్తారు. అధిక రక్తపోటు రోగులకు ఉప్పు హానికరం. కనుక అధిక రక్తపోటు ఉన్నవారు అదనపు ఉప్పుతో చేసిన అటుకుల తో చేసిన పోహా తినకూడదు

అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి కూడా పోహా మేలు చేయదు. ఎందుకంటే ఇది నూనె, మసాలాలతో తయారుచేస్తారు. ఫలితంగా దీన్ని తినడం వల్ల ఎసిడిటీ, ఉబ్బరం సమస్య పెరుగుతుంది

రోజు రోజుకీ దేశంలోనే కాదు విదేశాల్లోనూ పోహాకు ఆదరణ పెరుగుతోంది. అయితే ప్రతిరోజూ పోహ తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పోహా తేలికపాటి ఆహారం అయినప్పటికీ, ప్రతిరోజూ తినడం సరికాదు




