AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు కంపెనీ బంపర్‌ ఆఫర్‌..! బరువు తగ్గితే కోటి బోనస్‌..!! ఎక్కడో తెలిస్తే..

దాని ఫలితంగా అతని బరువు 17.5 కిలోలు తగ్గింది. బదులుగా అతను కంపెనీ నుండి రూ.85 వేలు బోనస్ పొందాడు. బరువు తగ్గించే సంస్థ ఈ ప్రత్యేకమైన ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు వారిని ప్రశంసించారు. ఎంత అద్భుతమైన కంపెనీ నేను అందులో భాగమై ఉంటే బాగుండేది' అని కొందరు చెబుతుండగా, 'నేను అక్కడ ఉంటే రోజుకు..

ఉద్యోగులకు కంపెనీ బంపర్‌ ఆఫర్‌..! బరువు తగ్గితే కోటి బోనస్‌..!! ఎక్కడో తెలిస్తే..
Weight Loss
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2024 | 5:56 PM

Share

ఒక్కసారి బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం ఎంత కష్టమో ఊబకాయంతో బాధపడుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఆహారంలో భారీ మార్పలు చేస్తుంటారు. వెయిల్‌లాస్‌ డైట్‌ ఫాలో అవుతుంటారు. మరికొందరు జిమ్‌ను ఆశ్రయించి గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. ఎంతకష్టపడినా చాలా మంది బరువు తగ్గలేరు. దాంతో కొంతమంది బరువు తగ్గేందుకు కొన్ని రకాల సర్జరీలు చేయించుకుంటారు. అయితే, అలా బరువు తగ్గినందుకు బదులుగా లక్షల రూపాయలు బోనస్‌ ఇస్తుంది ఓ కంపెనీ..! వినడానికి వింతగా అనిపించినప్పటికీ అలా ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి? అవును, స్థూలకాయంతో బాధపడుతున్న తన ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చిన అటువంటి సంస్థ ఈ రోజుల్లో వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కంపెనీ తన ఉద్యోగులకు బరువు తగ్గడానికి బోనస్ ఇస్తోంది. ఈ ప్రత్యేకమైన కంపెనీ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. దీని పేరు ఇన్‌స్టా 360. గత సంవత్సరం ప్రారంభించిన ఈ పథకం కింద చాలా మంది బరువు తగ్గడం ద్వారా డబ్బు సంపాదించారు. ఇందులో ఇప్పటి వరకు 150 మంది పాల్గొనగా ఏకంగా 800 కిలోల బరువు తగ్గారు. బరువు తగ్గినందుకు ప్రతిఫలంగా కంపెనీ ఉద్యోగులందరికీ బోనస్‌గా కోటి రూపాయలను పంపిణీ చేసింది.

నివేదికల ప్రకారం, కంపెనీ ఈ పథకం ‘వెయిట్ లాస్ బూట్ క్యాంప్’ లాగా పనిచేస్తుంది. ఒక్కో క్యాంప్‌ 3 నెలల పాటు కొనసాగుతుంది. మొత్తం 30 మంది ఉద్యోగులు ఇందులో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఐదు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఊబకాయం ఉన్న వారినే ఎంపిక చేశారు. ప్రతి క్యాంప్‌లో సభ్యులను మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో ఒక్కొక్కరు 10 మంది, 5 మంది వ్యక్తులతో కూడిన ప్రత్యేక టీంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, ప్రతి అర కిలో బరువు తగ్గినందుకు ఒక ఉద్యోగికి రూ. 4,593 లభిస్తుంది. అయితే వారి గ్రూప్‌లోని ఏ సభ్యుడి బరువు పెరిగినా, ఆ గ్రూప్‌లోని ఏ సభ్యుడికీ ప్రైజ్ మనీ లభించదు. బదులుగా రూ. 5,700 జరిమానా విధించబడుతుంది. గతేడాది ఈ పథకంలో పాల్గొన్న లీ అనే వ్యక్తి.. ఈ పథకం ద్వారా తనకు రెండు ప్రయోజనాలు వచ్చాయన్నారు. మొదటిది, అతని ఆరోగ్యం మెరుగుపడింది. రెండవది, అతను దాని నుండి అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించాడు.

బరువు తగ్గడానికి పరుగుతో పాటు స్విమ్మింగ్ కూడా చేస్తానని, బాస్కెట్‌బాల్ కూడా ఎక్కువగా ఆడానని లీ చెప్పాడు. ఇది కాకుండా, అతను తన ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ వహించాడు. దాని ఫలితంగా అతని బరువు 17.5 కిలోలు తగ్గింది. బదులుగా అతను కంపెనీ నుండి రూ.85 వేలు బోనస్ పొందాడు. బరువు తగ్గించే సంస్థ ఈ ప్రత్యేకమైన ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు వారిని ప్రశంసించారు. ఎంత అద్భుతమైన కంపెనీ నేను అందులో భాగమై ఉంటే బాగుండేది’ అని కొందరు చెబుతుండగా, ‘నేను అక్కడ ఉంటే రోజుకు 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని అని మరొకరు చెప్పారు. నాలాంటి ఉద్యోగి ఉంటే కంపెనీ దివాళా తీస్తుందని ఇంకొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..