Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threat: వార్నీ బుడ్డొడా.. ఫన్‌ కోసం ఎంత పనిచేశావ్‌ రా..! 13ఏళ్ల బాలుడు చేసిన పనితో..

విమానం ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి టొరంటోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే విమానం టేకాఫ్‌ తీసుకోనుంది. ఈ ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్‌ వచ్చింది.

Bomb Threat: వార్నీ బుడ్డొడా.. ఫన్‌ కోసం ఎంత పనిచేశావ్‌ రా..! 13ఏళ్ల బాలుడు చేసిన పనితో..
Air Canada
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2024 | 5:26 PM

Share

విమానాలపై బాంబు బెదిరింపు ఘటనలు కొత్తేమీ కాదు. గత కొద్ది రోజులుగా ఇలాంటి బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత వారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు కాల్‌ చేసింది.. ఓ 13 ఏళ్ల బాలుడు అని తెలిసి అధికారులు కంగుతిన్నారు. 13 ఏళ్ల బాలుడు సరదా కోసం టొరంటో విమానానికే బాంబు బెదిరింపు మెయిల్‌ పంపిన విషయం తెలిసి అధికార యంత్రంగంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. మైనర్ నిందితుడిని జెజెబి ముందు హాజరుపరిచారు. అసలు విషయం ఏంటంటే..

జూన్ 4న దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి టొరంటోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే విమానం టేకాఫ్‌ తీసుకోనుంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్‌ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల్ని వెంటనే కిందకు దింపేసి విమానంలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. బెదిరింపు బూటకమని తేలింది. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో విమానం 12 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

విచారణలో మీరట్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అతను తన తల్లి ఫోన్‌ను ఉపయోగించి ఎయిర్‌లైన్‌కు ఈ ఇమెయిల్‌ను పంపాడు. ఈ ఇమెయిల్ పంపడం కోసం అతడు నకిలీ ఇమెయిల్ ఐడిని క్రియేట్‌ చేసుకున్నాడు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫన్‌ కోసం ఇలా చేశానని చెప్పాడట. టీవీల్లో ఇలాంటి వార్తలు చాలానే చూస్తున్నా.. అందుకే సరదాగా మా అమ్మ ఫోన్ నుంచి మెయిల్ పంపాను’’ అని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు టీవీలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వార్త చూసిన తర్వాత కూడా ఆ బాలుడు తన తల్లిదండ్రులతో కూడా ఈ విషయం చెప్పలేదని తేలింది. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…