ఐఫోన్ పోగొట్టుకున్న అమ్మాయి కోసం.. 7 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం.. యూనిఫామ్‌లో ఉండి ఇలాంటి పనులా..?
ప్రభుత్వ అధికారులు చేసిన పనికి ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో @antiliyachalets అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకకు చెందిన ఒక మహిళ కేరళను సందర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఫోన్ ఒక బీచ్‌లో పడిపోయింది. దాని కోసం వెతకడానికి సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సదరు మహిళ ఐఫోన్ తిరిగి లభించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు చేసిన పనికి ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో @antiliyachalets అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మా బంగ్లాలో ఉంటున్న కర్ణాటక మహిళ రూ.150,000 విలువైన ఐఫోన్ బీచ్‌లోని పెద్ద రాళ్ల మధ్య పడిపోయిందని కర్ణాటక రిసార్ట్‌లోని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయబడింది. ఎంత వెతికినా ఫోన్ దొరకలేదు. దాంతో ఫోన్‌ను తిరిగి పొందడానికి కేరళ ఫైర్ అండ్ రెస్క్యూకి ఏడు గంటల సమయం పట్టిందని రాశారు.
కాగా, వీడియోపై స్పందించిన నెటిన్లు.. ఇది డబ్బు వృధా కాదా?- అని ప్రశ్నించారు మొబైల్ ఫోన్‌ల కోసం శోధించడానికి రెస్క్యూ టీమ్‌ను ఉపయోగించడం చూసి నేను ఆశ్చర్యపోయాను అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు రాశారు. ఆ బండరాళ్ల మధ్య ఏదైనా జంతువు చిక్కుకుపోయిందేమో అనుకున్నాను. కానీ, ఇది అద్భుతంగా ఉందంటూ ఇంకొకరు ఎద్దేవా చేశారు. ఇది మన డబ్బు వృధా తప్ప మరొకటి కాదని ఒకరు రాశారు. ఇది డబ్బును వృధా చేయడమే కాకుండా వనరులను కూడా వృధా చేయడమేనని ఒకరు రాశారు.
View this post on Instagram
నా మొత్తం జీవితంలో ఇంత చెత్త రీల్ చూడలేదని ఒకరు రాశారు. జనం ఎలా ఇష్టపడుతున్నారో తెలియడం లేదని, దీనిపై అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒకరు రాశారు. రీలు తయారు చేసి డిపార్ట్‌మెంట్‌ను దుర్వినియోగం చేశారని ఆ మహిళ క్షమాపణ చెప్పాలని మరొకరు రాశారు. రెస్క్యూ టీంకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..